హైదరాబాద్ టు విజయవాడ బస్ చార్జ్ @99! | hyderabad to vijayawada bus charfe rs99| flexi| bus| minister| ponnam| prabhakar
posted on Feb 7, 2025 9:16AM
హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సు టికెట్ కేవలం 99 రూపాయలు. ఔను మీరు వింటున్నది నిజమే. అయితే ఈ ధర కేవలం నాలుగు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వివరాల్లోకి వెడితే… తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గురువారం (ఫిబ్రవరి 6) ఫిక్స్ బస్ ఇండియాను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను(ఈవీ) ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్తు బస్సులను మంత్రి పొన్నం జెండా ఊపి ప్రారంభించారు. ఒక నెల రోజులలోగా ఈ బస్సులు హైదరాబాద్- విజయవాడల మధ్య తిరుగుతాయి.
వీటిని ప్రమోట్ చేసేందుకు వీటి సేవలు ప్రారంభమైన తరువాతా నాలుగు వారాల పాటు హైదరాబాద్ టు విజయవాడ కేవలం 99 రూపాయల టికెట్ చార్జితో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ బస్సుల్లో హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణ సమయం ఐదు గంటలు ఉంటుంది. ఈ బస్సు సీటింగ్ కెపాసిటీ 49. దశల వారీగా అన్ని రూట్లలోనూ వీటిని నడిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 6 వరకు బెంగళూరు నుండి దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలకు కేవలం రూ. 99 ప్రత్యేక ప్రమోషనల్ ఛార్జీ కింద ఫ్లెక్సీ ఇండియా బస్సులు నడిచిన సంగతి తెలిసిందే.