వైసీపీ పంచన చేరిన సాకే శైలజానాథ్ | apcc former president sailajanath join ycp| sake| jagan| presence| announce| kutami
posted on Feb 7, 2025 11:24AM
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ జగన్ పంచన చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శైలజానాథ్ జగన్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, హామీల అమలులో కూటమి సర్కార్ విఫలమైందని చెప్పారు. ప్రజల తరఫున వైసీపీ పోరాడుతుందన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.