Leading News Portal in Telugu

మస్తాన్ సాయి  డ్రగ్ కేసులో మరోట్విస్ట్ ..  ఎంటరైన నార్కోటిక్స్ పోలీసులు


posted on Feb 7, 2025 2:49PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మస్తాన్ సాయి డ్రగ్ కేసులో నార్కోటిక్స్ పోలీసులు ఎంటరయ్యారు. మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తున్న వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో నార్కోటిక్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఈ హార్డ్ డిస్క్ లో లభ్యం కావడంతో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు  మస్తాన్ సాయిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇదే హార్డ్ డిస్క్ లో డ్రగ్ పెడలర్ అయిన మస్తాన్ సాయి డ్రగ్స్ సేవిస్తున్న  వీడియోలు  బయటకొచ్చాయి. ఒక్క మస్తాన్ సాయితో పాటు మరికొందరి వీడియోలు  బయటకొచ్చాయి. ఈ వీడియోల్లో కనిపించిన వారు దాదాపు పరారయ్యారు. గుంటూరుకు చెందిన రాహుల్ ను నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  డ్రగ్స్ సేవిస్తున్న వీడియోలను  అడ్డం పెట్టుకుని మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్  చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.