Leading News Portal in Telugu

Trump says Putin wants peace in Ukraine, will begin talks on ending war


  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ట్రంప్ షాక్
  • కీవ్‌ నాటో సభ్యత్వం సాధ్యం కాదని వెల్లడి
Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ షాక్.. కీవ్‌ నాటో సభ్యత్వం సాధ్యం కాదని వెల్లడి

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యాకు సంబంధించిన భూభాగాలు అప్పగించాలంటూ ట్రంప్ సూచించారు. తాజాగా కీవ్‌ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

ఇది కూడా చదవండి: TOP 10 : రీరిలీజ్ లో కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. అనంతరం ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని తెలిపారు. ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ వెల్లడించారు. తేదీలు ఇంకా ఫిక్స్‌ కాలేదని వెల్లడించారు. అలాగని భారీ జప్యం జరగదని తెలిపారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని ట్రంప్ పేర్కొన్నారు.  ట్రంప్‌-పుతిన్ ఫోన్‌కాల్‌ చర్చలపై జెలెన్‌స్కీ స్పందిస్తూ.. కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై సంభాషణ జరిగినట్లుగా తెలిపారు.

ఇది కూడా చదవండి: Microsoft: హైదరాబాద్‌ జర్నీలో మైక్రోసాఫ్ట్‌ నూతన క్యాంపస్‌ ప్రారంభం మరో మైలురాయి: సీఎం