Leading News Portal in Telugu

IND vs BAN: టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్!


ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆడని రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు జట్టులోకి వచ్చారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో శుభారంభం కోసం భారత్ చూస్తోంది. బలాబలాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లో భారత జట్టే ఫేవరెట్‌గా కన్పిస్తోంది. రోహిత్‌ శర్మ, శుభమన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్ మీదున్నారు. ప్రతిభావంతులతో నిండిన బంగ్లాను తేలిగ్గా తీసుకోకుండా.. సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే శుభారంభం సులువే. పాక్‌తో ప్రతిష్ఠాత్మక పోరు ముంగిట ఈ మ్యాచును సన్నాహక మ్యాచ్‌లా ఉపయోగించుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.

తుది జట్లు:
భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభమన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ, హర్షిత్ రాణా.
బంగ్లాదేశ్‌: తంజిద్‌ హసన్‌, సౌమ్యా సర్కార్‌, తౌహిద్ హృదోయ్, నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (కెప్టెన్‌), మెహిదీ మిరాజ్‌, ముష్ఫికర్‌ రహీం (కీపర్), రిషద్‌ హుసేన్, జకేర్‌ అలీ, తన్జిమ్‌ హసన్‌, తస్కిన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్.