- నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య కీలక పోరు..
- టీమిండియా స్పిన్ ను చూసి మేము భయపడటం లేదు..
- మా దగ్గర అత్యుత్తమ పేస్ దళం ఉంది: పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ జావేద్

Pak Bowling Coach Aqib Javed: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు భారత్ తో పాకిస్థాన్ తలపడబోతుంది. ఈ చిరకాల ప్రత్యర్థులు దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడబోతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఐసీసీ మెగా ఈవెంట్లో పాక్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మాత్రం దాయాది దేశానికి మెరుగైన రికార్డు ఉంది. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఈ చర్య బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్‌ను అక్షర్ పటేల్ భయపెట్టగా.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మరొక ఎండ్ నుంచి ఒత్తిడిని కొనసాగించారు.
ఇక, టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ అకిబ్ జావేద్ స్పందించారు. ఈ సందర్భంగా భారత్ స్పిన్ దాడి గురించి తమ జట్టు ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు. తమ జట్టులో స్పిన్నర్లు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రతికూలత లేదన్నారు. తమ బలానికి తగ్గట్టుగా ఆడతామని చెప్పుకొచ్చారు. మాకు ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నారు.. ఈరోజు జరిగే మ్యాచ్ లో షాహీన్, నసీమ్, హారిస్‌తో కూడిన పేస్ దళం ఉందన్నారు. 3-4 స్పిన్నర్లను ఆడాలనే ప్రణాళికను టీమిండియా కలిగి ఉంది.. అదే వారి ప్రణాళిక.. మేము మా స్వంత బలంతో మా క్రికెట్ ఆడాలి.. మా జట్టులో ఎటువంటి పెద్ద మార్పులు కనిపించవు అని జావేద్ వెల్లడించారు.
అయితే, దుబాయ్ పిచ్ డే టైంలో స్పిన్నర్లకు సహాయంగా ఉంటుంది. బంగ్లాదేశ్ స్పిన్ ద్వయం మెహిదీ హసన్ మీరాజ్, రిషద్ హొస్సేన్ మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం కనిపించింది. అందువల్ల, స్పిన్ ఆధిపత్యం పాకిస్తాన్‌ను ఒక సమస్యగా మారింది. పాక్ జట్టులో అబ్రార్ అహ్మద్ అనే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ మాత్రమే ఉన్నాడు.. పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఖుష్దిల్ షా, సల్మా అఘా, కమ్రాన్ గులాం మద్దతుగా ఉంటారని పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ జావేద్ తెలిపారు.