
Bangladesh : రంజాన్ కు ముందు బంగ్లాదేశ్ లోని యూనుస్ ప్రభుత్వం పాకిస్తాన్ తో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ 50వేల టన్నలు బియ్యాన్ని బంగ్లాదేశ్ కు విక్రయించింది. 1971 తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి బియ్యం కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. ఈ బియ్యాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ మార్కెట్లకు పంపుతారు. బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం 54 సంవత్సరాల శత్రుత్వానికి ముగింపు పలికినట్లు అయింది. 1971లో పాకిస్తాన్ నుండి వేరుపడి బంగ్లాదేశ్ ఏర్పడింది. రంజాన్ సందర్భంగా ధరలను నియంత్రించడానికే పాకిస్తాన్ నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బంది పడుతోంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం బియ్యం ధర కిలోకు సగటున 75 రూపాయలు.
సాధారణంగా బంగ్లాదేశ్ భారతదేశం నుండి మాత్రమే బియ్యం కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసేది భారతదేశం. గతంలో బంగ్లాదేశ్ భారతదేశం నుండి 2 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసింది.. కానీ ఈసారి కొత్త తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్ నుండి కూడా బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈసారి యూసుఫ్ ప్రభుత్వం భారతదేశం నుండి 50 వేల టన్నుల బియ్యం, పాకిస్తాన్ నుండి 50 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు భారతదేశం నుండి 16 వేల టన్నుల బియ్యం అందుకుంది. రంజాన్ కు ముందు పాకిస్తాన్ నుండి బియ్యం బంగ్లాదేశ్ కు పంపనున్నారు.
బంగ్లాదేశ్ IRRI-6 బియ్యాన్ని బంగ్లాదేశ్‌కు పంపింది. ఈ బియ్యం తెల్లగా, పొడవుగా ఉంటాయి. దీనిని బిర్యానీ చేయడానికి ఉపయోగిస్తారు. బంగ్లాదేశ్‌తో వాణిజ్యం ప్రారంభంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశీయులకు వీసా నిబంధనలను సడలించింది. షేక్ హసీనా తిరుగుబాటు తర్వాత కూడా, బంగ్లాదేశ్ లోని సామాన్య పౌరులు ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఖర్జూరం ధర కిలోకు రూ.1500కి చేరుకుంది. చక్కెర, నూనె ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. రంజాన్ కు ముందు ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. దీని కింద, బంగ్లాదేశ్ ప్రభుత్వమే పెద్ద నగరాల్లో చౌక ధరలకు వస్తువులను విక్రయిస్తుంది. తద్వారా సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం పొందవచ్చు.