Leading News Portal in Telugu

TRAI brought new rules for new SIM cards


  • ట్రాయ్ కొత్త రూల్స్
  • కొత్త సిమ్ కార్డు కొనేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా
  • రూ. 2 లక్షల జరిమానా
  • 3 ఏళ్లు జైలు
SIM card rules: ట్రాయ్ కొత్త రూల్స్.. కొత్త సిమ్ కార్డు కొనేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా?.. 3 ఏళ్లు జైలు

స్మార్ట్‌ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. ఫోన్ లేకుండా కొన్ని గంటలు కూడా గడపలేని పరిస్థితి. ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉండాల్సిందే. సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ పనిచేయదు. కాబట్టి వ్యాలిడ్ సిమ్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇటీవల ట్రాయ్ సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ కార్డ్ పొందేవారు. కానీ ఇప్పుడు ఆధార్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి అయింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తైతే తప్పా సిమ్ కార్డ్ పొందలేరు. అయితే సిమ్ కార్డ్ కొనేటప్పుడు ఆ తప్పు చేస్తే మాత్రం మూడు నెలలు జైలు శిక్ష, భారీగా జరిమానా విధించనున్నారు. సైబర్ మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

సిమ్ కార్డులకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి

ఇప్పుడు కొత్త సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవడానికి ఆధార్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ చేయడం తప్పనిసరి అయింది.

రిటైలర్లు సిమ్ విక్రయించే ముందు ఈ ప్రక్రియను అనుసరించాలి.

సిమ్ కార్డులను అమ్మడానికి రిటైలర్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలను కూడా జారీ చేసింది. కస్టమర్ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్ కనెక్షన్లు ఉన్నాయో తనిఖీ చేయాలి. కస్టమర్ ఫోటోను 10 వేర్వేరు కోణాల నుంచి తీయవలసి ఉంటుంది.

9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే రూ. 2 లక్షల జరిమానా

DoT నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన ఆధార్‌ని ఉపయోగించి 9 సిమ్‌లను మాత్రమే కొనుగోలు చేయొచ్చు. 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే మొదటిసారి నేరం చేస్తే రూ. 50,000 జరిమానా, పదే పదే నేరం చేస్తే రూ. 2 లక్షల జరిమానా విధించబడుతుంది.

అక్రమంగా సిమ్ కార్డు పొందినందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష

అక్రమ మార్గాల ద్వారా సిమ్ కార్డు పొందినట్లయితే రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కాబట్టి మీ ఆధార్‌కు ఎన్ని సిమ్‌లు లింక్ చేయబడ్డాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటిలో ఉపయోగించని సిమ్ కార్డులను వెంటనే డిస్‌కనెక్ట్ చేసుకోవాలి.