Leading News Portal in Telugu

‘Babar Azam is a fraud’.. Shoaib Akhtar’s key comments


  • బాబర్ ఆజంపై షోయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు
  • బాబర్ ఆజం ‘మోసగాడు’- షోయబ్ అక్తర్
  • పాకిస్తాన్ క్రికెట్‌కు బాబర్ రోల్ మోడల్ కాదు- షోయబ్ అక్తర్.
Babar Azam: ‘బాబర్ ఆజం ఒక మోసగాడు’.. షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను ‘మోసగాడు’ అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు అతను ఏ మాత్రం రోల్ మోడల్ కాదని, మోసగాడు అని మండిపడ్డాడు. బాబర్ ఆజామ్ స్లో బ్యాటింగ్ కారణంగానే పాకిస్తా న ఓటమిపాలైందని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. బాబర్ ఆజం పెద్ద మ్యాచ్‌లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. బాబర్ ఆజం చాలా కాలంగా ఫామ్‌లో లేడు. దీంతో.. మ్యాచ్‌లలో రాణించలేకపోతున్నాడు.

‘గేమ్ ఆన్ హై’ షోలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ, “మేము ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోలుస్తాము. కానీ నిజంగా.. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లతో పోల్చడానికి బాబర్ ఆజం ఇంకా చాలా మారాలి. అతను జట్టు తరుపున ప్రదర్శించలేకపోతున్నాడు. ఈ కారణంగానే అతను విమర్శలకు గురవుతున్నాడు,” అని అక్తర్ పేర్కొన్నాడు. షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తన అసంతృప్తిని మరింత వ్యక్తం చేశాడు. ” పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఇష్టం లేదు, డబ్బులు ఇస్తున్నారని మాట్లాడుతున్నా” అంటూ అక్తర్ చెప్పాడు.

పాకిస్తాన్‌తో జరిగిన బిగ్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ గురించి షోయబ్ అక్తర్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్, అతను సూపర్ స్టార్ లాంటివాడు! అతను వైట్-బాల్ రన్ స్కోరర్! ఆధునిక కాలపు గొప్పవాడు! అతని గురించి ఎటువంటి సందేహం లేదు. నేను అతని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అతను అన్ని ప్రశంసలకు అర్హుడు.” అని వ్యాఖ్యానించాడు.