Leading News Portal in Telugu

Benefits of eating Fermented Curd rice


  • ‘పెద్దల మాట చద్ది మూట’ అనే సామేత సుపరిచితమే
  • చద్దన్నం వల్ల అనేక లాభాలు
  • అవేంటో ఇప్పుడు చూద్దాం
Fermented Curd rice: ఏంటి? చద్దన్నం తినడం వల్ల ఇన్ని లాభాలా?

‘పెద్దల మాట చద్ది మూట’ అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది. పెద్దలు చెప్పే విషయాలు మన మంచికే అని దీని అర్థం. కానీ.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడు ఉదయాన్నే అందరూ టిఫిన్‌కు ఎగబడుతున్నారు. పూర్వకాలంలో మన తాతాముత్తాతలు చద్దన్నం తినేవారు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన పూర్వీకులు ఎన్నాళ్లయినా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేవారు. ఉద‌యాన్నే చ‌ద్దన్నం, పెరుగు క‌లుపుకుని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

READ MORE: Jharkhand shocker: దారుణం.. పెళ్లి నుంచి వస్తున్న ఐదుగురు బాలికపై 18 మంది గ్యాంగ్ రేప్..

అన్నం, చపాతీల వంటివి చల్లబడినప్పుడు వాటి పిండి పదార్థంలోని అణువులు దగ్గర దగ్గరకు చేరుకొని, అతుక్కుంటాయి. ఈ ప్రతిచర్యే పిండి పదార్థం కఠినంగా మారటానికి తోడ్పడుతోంది. దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఈ కఠిన పిండి పదార్థం త్వరగా అరగదు. రక్తంలో గ్లూకోజు పెరగదు.
సంక్లిష్టంగా మారిన పిండి పదార్థం చిన్న పేగుల్లో జీర్ణం కాకుండా పెద్ద పేగులోకి వెళ్తుంది. అక్కడ విచ్ఛిన్నమై, పులిసిపోతుంది.
ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. ఇందులో కేలరీలూ తక్కువే.

READ MORE: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

పిండి పదార్థంలో ఒక గ్రాముకు 4 కేలరీలుంటే కఠిన పిండి పదార్థంలో 2.5 కేలరీలు ఉంటాయి. తక్కు తిన్నా.. ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గటానికి, అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. ఇది శరీరం ఇన్సులిన్‌కు స్పందించే సామర్థ్యాన్నీ పెంచుతుంది. దీంతో కణాలు గ్లూకోజును బాగా సంగ్రహిస్తాయి. ఫలితంగా మధుమేహం, గుండెజబ్బుల వంటి ముప్పులు తగ్గుతాయి. కఠిన పిండి పదార్థం మలాన్ని మృదువుగా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది.