Leading News Portal in Telugu

Hamas says solution reached over release of Palestinian prisonsers


  • బందీ-ఖైదీల మార్పిడిపై కుదిరిన సయోధ్య
  • టెల్అవీవ్ వేదికగా ఒప్పందం కుదిరిందన్న హమాస్
  • విడుదలకానున్న 600 మంది పాలస్తీనా ఖైదీలు
Israel-Hamas: బందీ-ఖైదీల మార్పిడిపై కుదిరిన సయోధ్య

మొత్తానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు-ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుండగా.. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ బందీల విడుదల సమయంలో హమాస్ క్రూరంగా ప్రవర్తిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో జాప్యం చేసింది. దీంతో కొంత సందిగ్ధం ఏర్పడింది. మొత్తానికి టెల్అవీవ్ వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిరిందని హమాస్ మంగళవారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: US: అమెరికాలో తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు

తొలి ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు హమాస్.. 33 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. తాజాగా నలుగురు బందీల మృతదేహాలను కూడా అప్పగించనున్నట్లు హమాస్ ప్రకటించింది. ఇక పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. 600 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలకానున్నారు. ఇదిలా ఉంటే తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 63 మంది బందీలను కూడా స్వదేశానికి తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Godavari River: మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

జనవరి 19న అమెరికా మద్దతుతో ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల సాయంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం శనివారంతో ముగుస్తుంది. అనంతరం ఏం జరుగుతుందో సస్పెన్ష్‌గా మారింది. ఇప్పటివరకు హమాస్.. 33 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్.. 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గురువారం మరో నలుగురు బందీల మృతదేహాలను హమాస్ అప్పగించనుంది.

2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో ఇజ్రాయెల్‌పై దాడి చేసి 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో వందలాది మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఐడీఎఫ్ పూర్తిగా ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను అరబ్ దేశాలు ఖండించాయి.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Cases: వల్లభనేని వంశీపై మరో ఫిర్యాదు