Leading News Portal in Telugu

Tecno Launches World Lightest Laptop Megabook S14 at MWC 2025


  • వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ (MWC 2025)లో సరికొత్త ఆవిష్కరణలు.
  • ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్‌ లాంచ్ చేసిన టెక్నో సంస్థ.
  • కేవలం 898 గ్రాములు బరువున్న ల్యాప్‌ట్యాప్‌.
Megabook S14: ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్‌ లాంచ్..

Megabook S14: వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను, ఆవిష్కరణలను వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2025 (MWC 2025)లో ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ఇప్పటికే వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇంకా అనేక ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో.. ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్‌ టెక్నో మెగాబుక్‌ S14 పేరుతో విడుదల చేసింది. టెక్నో ప్రకారం, టెక్నో మెగాబుక్‌ S14 ల్యాప్‌టాప్‌ ప్రపంచంలోనే తక్కువ బరువు కలిగిన 14 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగిన ల్యాప్‌ట్యాప్‌. ఈ ల్యాప్‌టాప్‌ బరువు కేవలం 898 గ్రాములు మాత్రమే. ఇదే దీని ప్రధాన ప్రత్యేకతని చెప్పవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ ‘బ్యాక్లిట్’ కీ బోర్డు సపోర్టుతో ఈ ల్యాప్‌ట్యాప్‌ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ తేలికైన ల్యాప్‌ట్యాప్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా చూస్తే ఇందులో.. టెక్నో మెగాబుక్‌ S14 ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల 2.8k OLED డిస్‌ప్లే, 2800×1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 440 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 91 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో ఉన్నాయి. ఇది విండోస్‌ 11 OS తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 12 కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ X Elite చిప్‌, Intel Core Ultra 7 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇక ఇందులో స్టోరేజ్ కూడా భారీగానే ఉంది. ఇందులో 32GB LPDDR5 ర్యామ్‌, 2TB SSD స్టోరేజీ కలిగి ఉండడంతో వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

ఈ టెక్నో మెగాబుక్‌ S14 లో 2MP కెమెరా, రెండు 2W స్టీరియో స్పీకర్లను అందించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 50Wh కెపాసిటి కలిగిన బ్యాటరీని అమర్చారు. దీనికి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 16 గంటల వరకు బ్యాకప్‌ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నో మెగాబుక్‌ S14 లో Ella AI అసిస్టెంట్‌ తో పాటు AI PPT జనరేటర్‌, AI మీటింగ్‌ అసిస్టెంట్‌, AI డ్రాయింగ్‌ సర్వీస్‌ వంటి అదనపు ఫీచర్లను కూడా అందించారు. అలాగే దీని కనెక్టివిటీ పరంగా చూస్తే.. బ్లూటూత్‌ 5.4, వైఫై 6E, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా..టెక్నో మెగాబుక్‌ S14 ల్యాప్‌టాప్‌ ధర, సేల్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అలాగే, ఈ ల్యాప్‌టాప్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేస్తారా లేదా అనే విషయంపై కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.