- OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్
- 6000mAh బ్యాటరీ
- ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ OnePlus లేటెస్ట్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. OnePlus ఇటీవల భారత్ లో OnePlus 13 సిరీస్‌ను విడుదల చేసింది. OnePlus 13, OnePlus 13R. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను కాంపాక్ట్ సైజులో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. OnePlus కంపెనీ OnePlus 13T లేదా OnePlus 13 Mini పేరుతో లాంచ్ చేయవచ్చని సమాచారం.
OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో కాంపాక్ట్ డిజైన్‌తో లాంచ్ చేయనుంది. OnePlus 13T 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఈ OnePlus ఫోన్ 6000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అమర్చారని టాక్. కెమెరా విషయానికి వస్తే.. ఈ OnePlus ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్ ఉంటుంది.
OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్‌లో భద్రత కోసం ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వవచ్చు. OnePlus 13 లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చింది. వన్‌ప్లస్ నుంచి రాబోయే కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను ఏప్రిల్ 2025 నాటికి లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.