- ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా
- చాలా సులువుగా యూఏఎన్ (UAN) నెంబర్ పొందవచ్చు.
- ఒక్క ఎస్ఎంఎస్ తో కూడా మీ UAN నెంబర్ను పొందే అవకాశం.

UAN Number: యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) అనేది ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాకు ప్రత్యేకంగా కేటాయించే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఉద్యోగి జీతం నుండి ప్రతి నెలా కొంత డబ్బు PF ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఈ UAN నెంబర్ ద్వారా మీ PF ఖాతాకు సంబంధించిన వివిధ సేవలను వినియోగించుకోవచ్చు. మీ EPF బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా, మొబైల్ నెంబర్ మార్చాలన్నా UAN అవసరం అవుతుంది. కానీ, కొన్నిసార్లు మనం ఈ UAN నెంబర్ను మర్చిపోతాం. అలాంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా కొన్ని విధానాలను పాటిస్తే మీ UAN నెంబర్ను సులభంగా తిరిగి పొందవచ్చు.
UAN నెంబర్ను తిరిగి పొందేందుకు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్, ఎస్ఎంఎస్ ద్వారా UAN నెంబర్ను తిరిగి పొందవచ్చు. ముందుగా, ఆన్లైన్ లో UAN నెంబర్ను తిరిగి ఎలా సంపాదించాలో చూద్దాం.
స్టెప్ 1: మొదటగా ఆధికారిక UAN వెబ్సైట్ కు వెళ్లాలి.
స్టెప్ 2: అక్కడ “Important Links” అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.
స్టెప్ 3: తర్వాత “Know Your UAN” అనే ఎంపికను క్లిక్ చేయాలి.
స్టెప్ 4: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరియు కాప్చా కోడ్ ఎంటర్ చేసి “Request OTP” పై క్లిక్ చేయాలి.
స్టెప్ 5: మీ మొబైల్కు వచ్చిన OTP కోడ్ ను సరైన స్థానంలో నమోదు చేయాలి.
స్టెప్ 6: చివరగా, “Show My UAN Number” అనే బటన్పై క్లిక్ చేస్తే, మీ UAN నెంబర్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
అలాగే మీరు ఇంటర్నెట్ లేని ప్రదేశంలో ఉన్నా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్క ఎస్ఎంఎస్ తో కూడా మీ UAN నెంబర్ను పొందే అవకాశం ఉంది. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్కు SMS పంపండి. కొద్దిసేపటి తర్వాత, మీ UAN నెంబర్ మీ మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తుంది.
UAN నెంబర్ మీ PF ఖాతాను నిర్వహించుకోవడానికి చాలా అవసరం. ఇది లేకుండా మీరు మీ PF డబ్బును చెక్ చేయడం, విత్డ్రా చేసుకోవడం లేదా ఏదైనా ఇతర మార్పులు చేయడం సాధ్యం కాదు. ఉద్యోగ కాలంలో జమయ్యే ఈ ప్రావిడెంట్ ఫండ్ మొత్తం 60 ఏళ్ల వయస్సు తర్వాత లేదా రిటైర్మెంట్ అనంతరం పొందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, మీరు మీ UAN నెంబర్ మర్చిపోతే, పై చెప్పిన ఆన్లైన్ లేదా SMS పద్ధతుల ద్వారా తిరిగి పొందవచ్చు.