Leading News Portal in Telugu

What happened when match tied or not played due to rain the ipl rules are


  • మార్చి 22 నుండి IPL 2025 సీజన్ ప్రారంభం,
  • జట్టు విజయం సాధిస్తే 2 పాయింట్లు
  • ఏదైనా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొక పాయింట్
  • మ్యాచ్ టై అయినప్పుడు, సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ నిర్ణయం
  • విజయం సాధించిన జట్టుకు 2 పాయింట్స్.
IPL 2025: మ్యాచ్ టై లేదా రద్దు అయితే.. రూల్స్ ఏమి చెబుతున్నాయంటే!

IPL 2025: ఈ ఏడాది ఐపీఎల్ 2025 సీజన్ రేపటి (మార్చి 22) నుండి ప్రారంభం కానుంది. చివరగా ఫైనల్ మ్యాచ్ 25 మే 2025 న జరగనుంది. ఇందులో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో, మ్యాచ్ టై లేదా రద్దు అయినా, పాయింట్లు ఎలా ఇస్తారన్న విషయాలను చూద్దాం.

ఐపీఎల్ 2025లో మొత్తం 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు విజయం సాధిస్తే 2 పాయింట్లు పొందుతుంది. అయితే, ఏదైనా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొక పాయింట్ ఇవ్వబడుతాయి. మ్యాచ్ టై అయినప్పుడు, సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ నిర్ణయం తీసుకుంటారు. సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన జట్టుకి 2 పాయింట్లు ఇవ్వబడతాయి. ఇలా లీగ్ స్టేజ్‌లో ఒక్కొక జట్టు 14 మ్యాచ్‌లు ఆడిన అనంతరం టాప్-4 జట్లు ప్లే-ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే, పాయింట్ల పట్టికలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్ల అంకెలు సమం ఉంటే, వాటి నెట్ రన్‌రేట్ ఆధారంగా టాప్-4 జట్లు నిర్ణయించబడతాయి.

ఇక ప్లే-ఆఫ్ సమయంలో నియమాలను చూస్తే.. లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత టాప్-2 జట్లు ప్లే-ఆఫ్ లో పెద్ద అనుకూలత పొందుతాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగుతుంది. దీని విజేత నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. మూడో, నాలుగో స్థానంలో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో రెండవ క్వాలిఫయర్ కోసం తలపడుతుంది. చివరగా, రెండవ క్వాలిఫయర్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ లలో వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ ను నిర్వహిస్తారు.