Leading News Portal in Telugu

Most IPL Finals Played players list MS Dhoni Leads the List with 11 Finals


  • ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లు
  • మొదటి ప్లేస్ లో 11 సార్లు ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని రికార్డ్.
  • లిస్ట్ లో పలువురు టాప్ ప్లేయర్స్.
IPL History: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లు ఎవరంటే?

IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను చూపించారు. అయితే, అత్యధిక ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2024 సీజన్ వరకు ధోనీ 11 ఐపీఎల్ ఫైనల్స్ లో పాల్గొన్నాడు. అతని తర్వాత ఇతర ప్రముఖ ఆటగాళ్లు కూడా అత్యధిక ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన లిస్ట్ లో స్థానాన్ని సంపాదించారు. మరి ఆ ఆటగాళ్ల లిస్ట్ ఒకసారి చూద్దామా..

ఎమ్‌ఎస్ ధోనీ (MS Dhoni) – 11 ఫైనల్స్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు దిగ్గజ కెప్టెన్‌గా నిలిచిన ఎమ్‌ఎస్ ధోనీ మొత్తం 11 ఐపీఎల్ ఫైనల్స్ లో పాల్గొన్నాడు. ఇందులో CSKతో పాటు, 2017 సీజన్ లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ (RPS) తరఫున కూడా ఫైనల్ ఆడాడు. దీనితో ధోనీ అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) – 8 ఫైనల్స్
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున 8 ఐపీఎల్ ఫైనల్స్ లో పాల్గొన్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జడేజా తరువాత CSKలో ప్రధాన ఆటగాడిగా మారాడు.

సురేశ్ రైనా (Suresh Raina) – 8 ఫైనల్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరైన సురేశ్ రైనా CSK తరఫున 8 ఫైనల్స్ లో ఆడాడు. రైనా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి CSK విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

అంబటి రాయుడు (Ambati Rayudu) – 8 ఫైనల్స్
అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున 8 ఐపీఎల్ ఫైనల్స్ లో ఆడాడు. రాయుడు ఐపీఎల్‌లో ఒక స్థిరమైన బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కాకుండా బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు.

రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) – 7 ఫైనల్స్
టీమిండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ CSK, రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వంటి జట్ల తరఫున 7 ఐపీఎల్ ఫైనల్స్ లో ఆడాడు.

డ్వైన్ బ్రావో (Dwayne Bravo) – 7 ఫైనల్స్
డ్వైన్ బ్రావో, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 7 ఫైనల్స్ లో ఆడాడు. ఒక మంచి ఆల్‌రౌండర్‌గా బ్రావో తన బౌలింగ్, హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో CSK విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

హార్దిక్ పాండ్యా (Hardik Pandya) – 6 ఫైనల్స్
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) తరఫున 6 ఫైనల్స్ లో పాల్గొన్నాడు. 2022లో గుజరాత్ టైటాన్స్‌ కు కెప్టెన్సీ చేసి జట్టును విజేతగా కూడా నిలిపాడు.

కీరన్ పొలార్డ్ (Kieron Pollard) – 6 ఫైనల్స్
ముంబై ఇండియన్స్ జట్టు తరఫున 6 ఐపీఎల్ ఫైనల్స్ లో ఆడిన కీరన్ పొలార్డ్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. హార్డ్ హిట్టింగ్, ఫినిషింగ్‌లో అతని బ్యాటింగ్ ఆటతీరు అద్భుతంగా ఉండేవి.

రోహిత్ శర్మ (Rohit Sharma) – 6 ఫైనల్స్
డెక్కన్ చార్జర్స్ (Deccan Chargers), ముంబై ఇండియన్స్ (MI) తరఫున 6 ఫైనల్స్ లో పాల్గొన్న రోహిత్ శర్మ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.

వీరి తర్వాత సుబ్రమణ్యం బద్రీనాథ్ (CSK), లసిత్ మలింగ (MI), అల్బీ మోర్కెల్ (CSK) లు 5 సార్లు ఫైనల్స్ ఆడారు.