Leading News Portal in Telugu

Lava launches 5G smartphone Lava Bold 5G in India


  • లావా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
  • లావా బోల్డ్ 5Gని భారత్ లో విడుదల చేసింది
  • 5,000mAh బ్యాటరీ
Lava Bold 5G: బడ్జెట్ ధరలో.. లావా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..

స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లావా తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ 5Gని భారత్ లో విడుదల చేసింది. ఇది MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64-రేటెడ్ బిల్డ్, 64-మెగాపిక్సెల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో సేల్ ప్రారంభంకానుంది.

లావా బోల్డ్ 5G ప్రారంభ ధర రూ.10,499. ఇది 4GB + 128GB, 6GB + 128GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. సఫైర్ బ్లూ రంగులో అందుబాటులో ఉంటుంది. లావా బోల్డ్ 5G ఆండ్రాయిడ్ 14 పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 అప్‌గ్రేడ్, రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్ డేట్ లతో వస్తుంది. ఇది 6.67-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇది MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో 6GB వరకు RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇది AI- సపోర్ట్ గల 64-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ వెనుక కెమెరా, 16-మెగాపిక్సెల్ ముందు కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ నీరు, ధూళి ప్రొటెక్షన్ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. లావా బోల్డ్ 5G భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.