- అడ్వాన్స్డ్ ఫిట్నెస్ ఫీచర్లతో.. హువావే నుంచి కొత్త స్మార్ట్‌వాచ్
- రూ. 14,999 ధరకు లాంచ్ చేశారు

స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీ హువావే తన కొత్త స్మార్ట్‌వాచ్ హువావే వాచ్ ఫిట్ 3ని భారత్ లో విడుదల చేసింది. హువావే నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫిట్నెస్ ఫీచర్లు, స్టైలిష్ లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైంది. హెల్త్, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని Huawei తాజా వాచ్‌ను విడుదల చేశారు. ఇది భారత్ లో రూ. 14,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
హువావే వాచ్ ఫిట్ 3 ఫీచర్లు
Huawei వాచ్ ఫిట్ 3.. 1.82-అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. WATCH FIT 3 లో వినియోగదారులు 100 కంటే ఎక్కువ వర్కౌట్ మోడ్‌లను పొందుతారు. ఈ వాచ్ GPS ఆధారిత ట్రాక్ రన్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది. వాచ్‌లో ఆటో-డిటెక్షన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. హువావే ఈ వాచ్‌లో ట్రూసీన్ 5.5 హృదయ స్పందన రేటు పర్యవేక్షణ వ్యవస్థను అందించింది. దీనితో పాటు, క్రమరహిత హృదయ స్పందన (A-fib), అకాల హృదయ స్పందనలను గుర్తించగల PPG సెన్సార్ అందించారు. దీనితో పాటు, హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు వాచ్‌లో అందించారు.
కంపెనీ ఒకే ఛార్జ్‌లో 10 రోజుల బ్యాకప్‌ను అందిస్తుందని పేర్కొంది. ఈ వాచ్ iOS, Android పరికరాలు రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. హువావే వాచ్ ఫిట్ 3 రెండు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ వాచ్ సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ నలుపు, గులాబీ, తెలుపు, ఆకుపచ్చ రంగులలో రూ. 14,999 ధరకు లాంచ్ చేశారు. నైలాన్ స్ట్రాప్ వేరియంట్ గ్రే కలర్ లో రూ. 15,999 ధరకు లభిస్తుంది. ఈ హువావే వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, హువావే అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.