Leading News Portal in Telugu

Realme NARZO 80x 5G Launched in India with 6.72 inches Display, IP69 Rating, and 6000mAh Battery Starting at 13999


  • కేవలం రూ.13,999లకే Realme NARZO 80x 5G మొబైల్.
  • 6.72 అంగుళాల డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
  • P68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు, 6000mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP పోర్ట్రయిట్ కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా
  • సైడ్ – మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB Type-C ఆడియో, సూపర్ లినియర్ స్పీకర్ వంటి ఫీచర్లు.
Realme NARZO 80x 5G: కేవలం రూ.13,999లకే 6.72 అంగుళాల డిస్ప్లే, IP69 రేటింగ్స్, 6000mAh బ్యాటరీ

Realme NARZO 80x 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్లైన NARZO 80x 5G, NARZO 80 Pro 5G లను నేడు (ఏప్రిల్ 9)న భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించినట్టుగానే.. ఈ ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా NARZO 80x 5G ధరకు ఎక్కువ స్పెసిఫికేషన్లనే అందించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే..

ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఇవ్వబడింది. ఇది 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో పనిచేస్తుంది. ఫోన్ డిస్‌ప్లే గరిష్ఠంగా 680 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. Speed Wave Designతో 7.94mm స్లిమ్ బాడీ, IP68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులోని SonicWave Water Ejection టెక్నాలజీ ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. ఈ ఫోన్‌ లో శక్తివంతమైన MediaTek Dimensity 6300 SoC (6nm) ప్రాసెసర్ వాడబడింది. అలాగే గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPU కలదు. ఫోన్‌లో 6GB లేదా 8GB LPDDR4x RAM, అలాగే 128GB స్టోరేజ్ ఇవ్వబడింది. ఇది 2TB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.

ఇక మొబైల్ కెమెరా సెటప్ చూసినట్లయితే ఇందులో.. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇది OMNIVISION OV50D సెన్సార్ ఉపయోగించి తీయడంతో ఫోటోలు మంచి క్వాలిటీతో వస్తాయి. అలాగే 2MP పోర్ట్రయిట్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. Android 15 ఆధారంగా నిర్మించబడిన realme UI 6.0, సైడ్ – మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB Type-C ఆడియో, సూపర్ లినియర్ స్పీకర్, 6000mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తాయి.

ఇక ధరలు, లభ్యత విషయానికి వస్తే.. 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,999, 8GB + 128GB వేరియంట్ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫోన్ లాంచింగ్ ఆఫర్ కింద మొబైల్ పై రూ.1500 ప్రత్యేక డిస్కౌంట్ కూడా కలిగి ఉంది. మొత్తంగా ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇది మిడ్-రేంజ్ కేటగిరీలో బాగా పోటీ ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్, ఇంకా పటిష్టమైన నిర్మాణం ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.