Leading News Portal in Telugu

Realme NARZO 80 Pro 5G Launched in India With 6.77 inches AMOLED Display, 50MP Camera, and IP69 Rating


  • కొత్త Narzo 80 సిరీస్‌ ఫోన్లను భారత మార్కెట్‌లో నేడు అధికారికంగా విడుదల
  • Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు వేరియంట్లు లాంచ్
  • 6.77 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, IP69 రేటింగ్
  • MediaTek Dimensity 7400 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6తో పని
  • 50MP ప్రధాన కెమెరా (OIS), 2MP సెకండరీ కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా
  • 6000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్, 65W రివర్స్ చార్జింగ్ సపోర్ట్
  • 8GB + 128GB వేరియంట్ ధర రూ.13,999
  • 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,499 రియల్‌మీ NARZO 80 Pro 5G సొంతం.
Realme NARZO 80 Pro 5G: 6.77 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, IP69 రేటింగ్ తో వచ్చేసిన రియల్‌మీ నార్జో 80 ప్రో

Realme NARZO 80 Pro 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త Narzo 80 సిరీస్‌ ఫోన్లను భారత మార్కెట్‌లో నేడు (ఏప్రిల్ 9)న అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. అధునాతన ఫీచర్లతో, శక్తివంతమైన ప్రాసెసర్లతో, భారీ బ్యాటరీలతో ఈ ఫోన్లు మిడ్ రేంజ్ వినియోగదారులకే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఈ రెండు ఫోన్లు అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఏప్రిల్ 9న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు Narzo 80 Pro 5G పై Early Bird Sale ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న Narzo 80x 5G కూడా అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ లో రూ. 2,000 వరకు డిస్కౌంట్, అలాగే విద్యార్థులకు ప్రత్యేకంగా రూ.1,299 విలువ గల ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఇక రియల్‌మీ Narzo 80 Pro 5G ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.77 అంగుళాల Full HD+ కర్వ్డ్ ఆమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నైట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇక ఇందులో MediaTek Dimensity 7400 SoC ప్రాసెసర్ అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6తో పని చేస్తుంది. ఇక మొబైల్ లోని కెమెరా విషయానికి వస్తే ఇందులో వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (OIS), 2MP సెకండరీ కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా (EIS సపోర్ట్) లభిస్తాయి.

ఇక ఈ మొబైల్ లో 6000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్, 65W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ను అందించనున్నారు. అలాగే IP69 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్-C పోర్ట్ లభిస్తాయి. ఈ ఫోన్‌లు నిట్రో ఆరంజ్, రేసింగ్ గ్రీన్, స్పీడ్ సిల్వర్ రంగులలో లభ్యమవుతాయి. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ.13,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,499గా నిర్ణయించారు.