- బాత్‌రూమ్ కన్నా మలినంగా ఉండే బెడ్‌రూమ్!
- దిండ్లపై 17 వేల రకాల బ్యాక్టీరియా
- టాయిలెట్ కంటే ప్రమాదకరంగా దుప్పట్లు
- చర్మ సమస్యలు, అలర్జీలు పెరగడంలో కారణం

బాత్‌రూంలో ఎంత బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఉంటాయో అందరికీ తెలుసు. కంటికి కనిపించని సుక్షజీవులు చాలా ఉండాయి. అందుకే బాత్‌రూంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉండే చోటు ఒకటి ఉంది. అదే మీ బెడ్‌రూమ్. ఏంటి అవాక్కయ్యారా? ఇది అక్షరాల నిజం. బెడ్‌రూంలో నిత్యం వాడే దిండ్లపై బాత్‌రూంలో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
READ MORE: Vasamsetti Subhash: నోటి దురద తగ్గించుకో.. లేకుంటే తాటతీస్తా!
‘‘బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండ్ల కవర్లు క్రమం తప్పకుండా ఉతకకపోతే బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో పేరుకుంటుంది. నాలుగు వారాల పాటు వీటిని ఉతక్కుండా ఉంటే దిండ్ల కవర్లు, దుప్పట్లపై టాయిలెట్‌లో కంటే 17 వేల ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది. అంటే ఒక చదరపు అంగుళంలో 3 నుంచి 5 మిలియన్ల బ్యాక్టీరియా వరకూ వచ్చి చేరుతాయి’’ అని సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గ్రామ్ నెగెటివ్ రాడ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, బాసిల్లై, గ్రామ్ పాజిటివ్ కొక్కై వంటి బ్యా్క్టీరియా వచ్చి చేరుతాయని స్పష్టం చేసింది. వీటిల్లో కొన్ని ప్రమాదకరం కాకపోయినా మిగతావి మాత్రం వ్యాధి కలుగజేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ MORE: Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి.. 21 మంది మృతి, 80 మందికి గాయాలు..
అపరిశుభ్ర దిండ్లపై నిద్రిస్తే హానికారక బ్యాక్టీరియా, ఫంకై, ఇతర అలర్జీ కారకాల బారిన పడాల్సి వస్తుందని.. మొటిమలు, ఇతర చర్మ సంబంధిత రోగాలు చుట్టుముడతాయంటున్నారు. స్వేదం, మృత చర్మ కణాలు వంటివాటితో నిండిన దిండ్ల కవర్ల.. చర్మంలోని స్వేదగ్రంథుల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయట. దీంతో, చర్మ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమవుతాయట. అందుకే దిండ్లను ఎక్కువ కాలం వాడకుండా మారుస్తూ ఉండండి. చిన్న పిల్లల దిండ్ల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.