Leading News Portal in Telugu

Samsung launches Galaxy M56 5G smartphone


  • సామ్ సంగ్ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
  • రూ. 24,999 ప్రారంభ ధరకు
  • HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్
Samsung Galaxy M56: మెస్మరైజ్ చేసే ఫీచర్లతో సామ్ సంగ్ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఈ కార్డుపై రూ.3 వేల డిస్కౌంట్

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త Samsung Galaxy M56 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్, AI ఫీచర్లుతో విడుదల చేశారు. Samsung Galaxy M56 ఆరు సంవత్సరాల పాటు అప్‌డేట్‌లను పొందుతుంది.

భారత్ లో Samsung Galaxy M56 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 24,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 23న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియా, సామ్ సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుకోవచ్చు. Samsung Galaxy M56 స్మార్ట్‌ఫోన్‌ను లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Samsung Galaxy M56 స్పెసిఫికేషన్లు

Samsung M56 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ Samsung ఫోన్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ అందించారు. ఇది 8GB LPDDR5x RAM, 128GB, 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ Samsung ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ అందించారు. Samsung తాజా ఫోన్ Android 7 OS ఆధారంగా One UI 15 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో AI ఎరేజర్, ఎడిట్ సజెషన్స్, ఇమేజ్ క్లిప్పర్ వంటి AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy M56 స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌తో పాటు 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో వస్తుంది. 5G, 4G LTE, బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.