Leading News Portal in Telugu

Google Ends Android 12 Security Updates


  • గూగుల్ ప్రతి ఆండ్రాయిడ్ వెర్షన్‌కు కొన్ని సంవత్సరాలు మాత్రమే అప్ డేట్స్
  • Google ఇప్పుడు ఈ వెర్షన్‌లకు సెక్యూరిటీ అప్ డేట్స్ పంపడం ఆపివేస్తోంది
  • మీ స్మార్ట్‌ఫోన్ భద్రత ప్రమాదంలో పడొచ్చు
Google: గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం.. లక్షలాది స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం!

గూగుల్ నిర్ణయం కారణంగా లక్షలాది స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం చూపనుంది. గూగుల్ తన పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో కొన్నింటిలో సెక్యూరిటీ అప్ డేట్స్ కు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేసింది. మీరు Android 12 లేదా 12L ఆపరేటింగ్ సిస్టమ్‌ గల ఫోన్లను యూజ్ చేస్తుంటే ఇకపై గూగుల్ సెక్యూరిటీ అప్ డేట్స్ ను పొందలేరు. ఈ వెర్షన్‌లకు సెక్యూరిటీ అప్ డేట్స్ అందించడం Google ఆపేసింది. గూగుల్ నిర్ణయంతో మీ స్మార్ట్‌ఫోన్ భద్రత ప్రమాదంలో పడొచ్చు.. హ్యాకర్లకు లక్ష్యంగా మారే ఛాన్స్ ఉంటుంది.

గూగుల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే.. గూగుల్ ప్రతి ఆండ్రాయిడ్ వెర్షన్‌కు కొన్ని సంవత్సరాలు మాత్రమే అప్ డేట్స్ ను అందిస్తుంది. సాధారణంగా ఈ కాలం 3 నుంచి 4 సంవత్సరాలు. Android 12, 12L ఇప్పుడు ఈ పరిమితిని దాటాయి. కాబట్టి Google ఇప్పుడు ఈ వెర్షన్‌లకు సెక్యూరిటీ అప్ డేట్స్ పంపడం ఆపివేస్తోంది. సెక్యూరిటీ అప్ డేట్స్ ఆపివేయడం వలన ఫోన్ ప్రొటెక్షన్ తగ్గుతుంది. ఫోన్‌లో బగ్‌లు పెరగవచ్చు, ఇది దాని పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. డేటా, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ చెల్లింపులు ప్రమాదంలో పడవచ్చు.

హ్యాకర్లు పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే వాటికి భద్రత లేదు. యూజర్ల ఫోన్లను సురక్షితంగా ఉంచడానికి Google ప్రతి నెలా సెక్యూరిటీ అప్ డేట్స్ పంపుతుంది. ఈ అప్ డేట్స్ ఫోన్‌ను వైరస్‌లు, మాల్వేర్, ఇతర సైబర్ అటాక్స్ నుంచి రక్షిస్తాయి. అప్ డేట్స్ అందకపోతే ఫోన్ క్రమంగా పనితీరు తగ్గిపోతుంది. వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడుతుంది.