Leading News Portal in Telugu

Upcoming smartphones from Oppo, Vivo, and Realme


  • కొత్త ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ
  • ఒప్పో, వివో, రియల్‌మీ నుంచి విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్స్
Smartphone: ఒప్పో, వివో, రియల్‌మీ నుంచి విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ కొత్త ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కేక పుట్టించే ఫీచర్లతో మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. వచ్చే వారం భారతీయ మార్కెట్లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఒప్పో, వివో, రియల్‌మీ కంపెనీలు తమ ఫోన్లను విడుదల చేయనున్నాయి. మంచి కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో రానున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఒప్పో K13 5G

Oppo ఈ కొత్త ఫోన్ రేపు అంటే ఏప్రిల్ 21, 2025న లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 6.67-అంగుళాల AMOLED డిస్ల్పే, ఫుల్ HD+, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ కూడా ఫోన్‌లో అమర్చారు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. 7000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 తో రావచ్చు. దీని ధర దాదాపు రూ. 20,000 ఉండవచ్చు.

వివో T4 5G

ఈ ఫోన్ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. దీని లాంచ్ తేదీ ఏప్రిల్ 22, 2025. Vivo T4 5Gలో 6.77-అంగుళాల పూర్తి HD AMOLED డిస్‌ప్లేను చూడవచ్చు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 nits బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. దీనిని Adreno 720 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో అందించవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పనిచేస్తుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, 7,300mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో T4 ధర కూడా దాదాపు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ఉండవచ్చు.

రియల్‌మీ 14T 5G

రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను ఏప్రిల్ 24 న లాంచ్ చేయబోతోంది. ఇది 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ తో రానుంది. MediaTek 6300 ప్రాసెసర్‌ను అమర్చే ఛాన్స్ ఉంది. 8GB RAM, 256GB స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.