- సామ్ సంగ్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్
- గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఫ్రీగా పొందే ఛాన్స్
- వాక్-ఎ-థాన్ ఇండియా ఫిట్‌నెస్ ఛాలెంజ్

ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకించింది. రూ. 51 వేల విలువైన గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఫ్రీగా ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సామ్ సంగ్ లవర్స్ ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. కంపెనీ తన వాక్-ఎ-థాన్ ఇండియా ఫిట్‌నెస్ ఛాలెంజ్ రెండవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో విన్ అయిన వారికి స్పెషల్ ప్రైజ్ అందిస్తారు. వాక్-ఎ-థాన్ ఇండియా ఫిట్‌నెస్ ఛాలెంజ్ లో పాల్గొనేవారు ఇచ్చిన గడువులోపు స్టెప్ గోల్ పూర్తి చేస్తే, వారికి గెలాక్సీ వాచ్ అల్ట్రా ఉచితంగా లేదా దాని కొనుగోలుపై తగ్గింపు లభిస్తుంది. అయితే, శామ్సంగ్ హెల్త్ యాప్ వినియోగదారులు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు. శామ్సంగ్ వాక్-ఎ-థాన్ ఇండియాలో పాల్గొనేవారు గెలాక్సీ వాచ్ అల్ట్రాను గెలుచుకునే అవకాశం ఉంటుంది.
Samsung Health యాప్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ ఛాలెంజ్ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమైంది. మే 20, 2025 వరకు కొనసాగుతుంది. అర్హత సాధించడానికి ఈ ఒక నెలలో మొత్తం 2 లక్షల అడుగులు నడవాలి. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి అన్ని Samsung Health యాప్ వినియోగదారులు అర్హులు. #WalkathonIndia అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి Samsung సభ్యుల యాప్‌లో స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఈవెంట్ ముగింపులో, లక్కీ డ్రా ద్వారా ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తారు. వారికి గెలాక్సీ వాచ్ అల్ట్రాను బహుమతిగా అందిస్తారు. లక్ష్యాన్ని సాధించిన ఇతరులకు స్మార్ట్‌వాచ్‌పై 25 శాతం వరకు తగ్గింపును అందిస్తారు. శామ్‌సంగ్ హెల్త్ యాప్‌లోని ‘టుగెదర్’ ట్యాబ్‌కి వెళ్లి మీరు నమోదు చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
గెలాక్సీ వాచ్ అల్ట్రా ధర
ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో Samsung Galaxy Watch Ultra ధర రూ.51,999. ఇది టైటానియం బిల్డ్, 1.5-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ వాచ్‌లో గెలాక్సీ వాచ్ 7 మాదిరిగానే ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. కానీ ఇది 10ATM నీటి నిరోధకతను కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ వాచ్ 590mAh బ్యాటరీని కలిగి ఉంది. కాబట్టి మీరు దీన్ని పవర్-సేవింగ్ మోడ్‌లో 100 గంటల వరకు ఉపయోగించవచ్చు.