
HONOR X60 GT: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్, నేడు తన కొత్త హై-ఎండ్ గేమింగ్ ఫోన్ Honor X60 GT ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్, స్క్రీన్, కెమెరా, పనితీరు, బ్యాటరీ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోన్‌లోని చతురస్రాకార కెమెరా మాడ్యూల్, గేమింగ్‌కు అనుకూలమైన స్పెసిఫికేషన్లు మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ మొబైల్ విశేషులను ఒకసారి చూద్దామా..
Honor X60 GT ప్రో మోడళ్లతో పోలిస్తే, ఇందులో చతురస్రాకార ఆకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై చెక్‌డ్ గ్లోవీ డిజైన్ ఉండగా, ఫాంటమ్ నైట్ బ్లాక్ కలర్ లో మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఈ ఫోన్ టిటానియం షాడో సిల్వర్, టిటానియం షాడో బ్లూ, ఫాంటమ్ నైట్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ మొబైల్ కేవలం 193 గ్రా.ల బరువు మాత్రమేతో ఉంటుంది. ఫ్రంట్ భాగంలో పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల AMOLED స్క్రీన్ ఉంది. ఇది ఫుల్ HD+, 1.07 బిలియన్ కలర్స్, DCI-P3 కలర్ గామట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz PWM జీరో-రిస్క్ డిమ్మింగ్ వంటి అత్యున్నత ఫీచర్లను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2700Hz టచ్ రెస్పాన్స్ వంటి స్పెసిఫికేషన్లతో ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి పనుల కోసం మంచి అనుభూతిని ఇస్తుంది. ‘ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్’ టెక్నాలజీ ద్వారా కంటి చూపు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించబడింది.
Honor X60 GT లో Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్, Adreno 730 GPU తో కలిపి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా తయారైన MagicOS 9.0 పై నడుస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ తో ఉంది. ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాటరీ, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. Honor X60 GT లో 6300mAh లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ ఉంది. ఇది 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే ఇందులో IP65 రేటింగ్, ఇన్‌ఫ్రారెడ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 360° మోషన్ సిక్‌నెస్ రిలీఫ్, 3D నేచురల్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుంది. 12GB + 256GB – 1799 యెన్స్ (సుమారు రూ. 20,845), 12GB + 512GB – 1999 యెన్స్ (సుమారు రూ. 23,165), 16GB + 512GB – 2399 యెన్స్ (సుమారు రూ. 27,800)గా ఉన్నాయి. ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. Honor X60 GT ఖచ్చితంగా మిడ్-టు-హై రేంజ్ సెగ్మెంట్‌లో మంచి పోటీని ఇవ్వనుంది.