vivo T4 5G with 120Hz AMOLED Display, Snapdragon 7s Gen 3, 7300mAh Battery Launched in India Starting at 21999

Vivo T4 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన T సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో T4 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మంచి ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల వద్ద వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి ఈ అద్భుతమైన మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
vivo T4 5G ఫోన్లో 6.77 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 1300 నిట్స్ హై బ్రైట్ మోడ్, అలాగే గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది అత్యంత ప్రకాశవంతమైన డిస్ప్లేల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఇది 2.5GHz వరకు వేగంతో పనిచేసే ఆక్టా-కోర్ CPU, Adreno 720 GPU తో కూడి వస్తుంది. ఇందులో 8GB / 12GB ర్యామ్, 128GB / 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక కెమెరా సెటప్ చూసినట్లయితే ఇందులో.. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (సెన్సార్‌తో), 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇది ఔరా లైట్ సపోర్ట్‌తో 4K వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తుంది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది కూడా 4K వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించిన ఫన్ టచ్ OS 15పై పనిచేస్తుంది. వివో కంపెనీ ప్రకారం, ఈ ఫోన్‌కు రెండు ఆండ్రాయిడ్ OS అప్డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, USB టైపు-C ఆడియో, బాటమ్ పోర్టెడ్ స్పీకర్, IP65 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉన్నాయి. ఇకపోతే ఈ మొబైల్ లో భారీగా 7300mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
ఈ ఫోన్ ఎమెరాల్డ్ బ్లాజ్, ఫాంటమ్ గ్రే అనే రెండు రంగులలో లభ్యమవుతుంది. ఇక ఈ మొబైల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 8GB + 128GB రూ. 21,999, 8GB + 256GB రూ.23,999, 12GB + 256GB రూ.25,999 గా ఉంది. ఈ ఫోన్ ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా eStore, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మొబైల్ లో ప్రారంభ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.2000 తక్షణ డిస్కౌంట్, రూ.2000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా కలిగి ఉంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. వివో T4 5G భారత వినియోగదారుల కోసం అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడిన మిడ్‌రేంజ్ ఫోన్.