- స్కూలుకెళ్లే పిల్లలకే కళ్ల జోడు
- 2050 వరకు 50% మందికి కళ్ల జోడు
- ప్రస్తుతం 30% మందికి కళ్ల జోడు
- తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న వైద్యులు

ఒకప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు మధ్య వయస్సు దాటితే కాని కనిపించేవి కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. ఇందుకు కారణం మయోపియా అని డాక్టర్లు చెబుతున్నారు. అంటే హ్రస్వదృష్టి. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో కనుగుడ్డు ఉండాల్సిన దానికంటే పొడవుగా ఉంటుంది. దాంతో సరిగ్గా రెటీనా మీద కేంద్రీకృతం (ఫోకస్) కావాల్సిన కాంతికిరణాలు… రెటీనాకు కాస్త ముందే కేంద్రీకృతమవుతాయి.
READ MORE: PM Modi: ఆస్ట్రేలియా ఎన్నికల్లో ప్రధాని ఆంథోనీ అల్బనీస్ విజయం.. పీఎం మోడీ అభినందనలు..
దాంతో దగ్గరి వస్తువులు మాత్రమే స్పష్టంగా కనిపిస్తూ దూరాన ఉన్న వస్తువులు మాత్రం స్పష్టంగా కనిపించవు. కంప్యూటర్లు, ఫోన్లకు పరిమితమై ఎక్కువ కాలం వాటితోనే గడిపే విద్యార్థులు మయోపియా (హ్రస్వ దృష్టి) సమస్యకు లోనవుతున్నారని ఎయిమ్స్ తాజా పరిశోధనలో వెల్లడైంది.ఈ సమస్యతో సతమవుతున్న ప్రతీ ఐదుగురిలో ఒక్కరు పలురకాల దృష్టి లోపాలకు గురవటమేకాక, ఒక్కోసారి చూపుకోల్పోతున్నారని తెలుస్తోంది. దేశంలోని పాఠశాల విద్యార్థుల్లో 23 శాతం మంది దీని వల్ల ఇబ్బంది పడుతున్నారు.
READ MORE: RCB vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆప్స్‌కు ఆర్సీబీ?
నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ప్రజా అవగాహన కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఆప్తాల్మాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా (ACOIN) వైద్యులు మాట్లాడుతూ.. స్క్రీన్ వ్యసనం అంశాన్ని లేవనెత్తారు. త్వరగా చర్యలు తీసుకోకపోతే.. 2050 నాటికి పాఠశాలకు వెళ్లే పిల్లలలో 50% వరకు మయోపియా వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాగా.. ప్రస్తుతం పాఠశాల పిల్లలలో దాదాపు 23% మందికి మయోపియా ఉంది. ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లతో పిల్లలు ఎక్కువసేపు గడపడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తోంది. ఇది తల్లిదండ్రులకు, వైద్యులకు పెద్ద ఆందోళనగా మారింది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి పిల్లలను ఆన్లైన్ అభ్యాసం, స్క్రీన్ వాడకం వైపు నెట్టింది.
READ MORE: Suspicious Death: వివాహిత అనుమానాస్పద మృతి.. తిరువూరులో ఉద్రిక్తత..
అయితే.. చాలా మంది పిల్లలకు మయోపియాకు శస్త్రచికిత్స అవసరం లేదని సూర్య ఐ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, సీనియర్ కంటి సర్జన్ డాక్టర్ జే గోయల్ అన్నారు. “చాలా మంది పిల్లలకు మయోపియా విషయంలో ఆపరేషన్ అవసరం లేదు. మీ పిల్లలను ఇప్పటి నుంచే స్క్రీన్ లకు దూరంగా ఉంచండి. నిద్ర లేమి సమస్యను లేకుండా చూడండి. వారిని ఆటలు ఆడనివ్వండి.” అని ఆయన తెలిపారు. స్క్రీన్ వాడకం ఊబకాయ సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయట. ఈ వ్యాధి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.