Leading News Portal in Telugu

Chemically grown mangoes pose serious health risks


  • వేసవి మామిడి పండ్ల సీజన్
  • పండ్లకే రారాజుగా మామిడి
  • పండ్ల పక్వానికి కెమికల్స్
  • వాటితో ప్రాణాంతక వ్యాధులు
Mangoes: ఇలాంటి మామిడి పండ్లు తింటున్నారా? మీకు క్యాన్సర్ ముప్పు తప్పదు?

వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. పచ్చి లేదా పండు మామిడి తిని ‘ఆహా ఏమి రుచి!’ అని అనకుండా ఉండలేరు. అంతేకాదు మామిడిలో పోషక విలువలు కూడా ఎక్కువే.. కానీ మనం అనుకున్నట్లు అన్ని మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి కాదు. పండ్లు పక్వానికి వచ్చేలా చేసే ప్రాసెస్ తో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.

READ MORE: Chiranjeevi : మెగాస్టార్ క్రేజ్.. రూ.6 టికెట్ కు రూ.210.. అప్పట్లో ఇదో సెన్సేషన్..

అసలు సమస్య అక్కడే మొదలవుతోంది. వ్యాపారులకు విక్రయించని రైతులు.. పండ్ల పండాక కోసి.. మార్కెట్లకు తరలిస్తారు. కానీ.. వ్యాపారులు కొనుగోలు చేసిన తోటల్లో.. పండ్లు పూర్తిగా పండకముందే.. కోస్తున్నారు. వాటికి రసాయనాలు పూసి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని ఇతర పట్టణాలు, నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు. రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు బారినపడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా.. క్యాన్సర్, అల్సర్, లివర్‌, కిడ్నీ, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాల్షియం కార్బైడ్‌ ద్వారా వెలువడే ఎసిటిలిన్‌ వాయువు.. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కొనే ముందు వాటిని పరీక్షించండి. పండుపై బూడిదరంగు పొర కనిపిస్తే వాటిని కొనకపోవడమే మంచిది. లేదా వాటిని బాగా కడుక్కొని తినండి.