Leading News Portal in Telugu

OPPO to Launch Reno14 Series, Pad SE, and Enco Clip Earbuds in China on May 15


OPPO: ఒకేసారి కొత్త ఫోన్, టాబ్లెట్, ఇయర్‌బడ్స్లను గ్లోబల్గా విడుదల చేయనున్న ఒప్పో..!

OPPO: ఒప్పో (OPPO) మరోసారి తన కొత్త గ్యాడ్జెట్‌లను మే 15న చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్‌లో ఒప్పో Reno14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, OPPO Pad SE టాబ్లెట్, OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్‌లను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే లీకైన డిజైన్ ప్రకారం OPPO Reno14 ఫోన్‌లో రెండు పెద్ద కెమెరా సెన్సార్లు, ఒక చిన్న సెన్సార్ ఉండనుంది, ఇవి Reno13 డిజైన్‌ను తలపిస్తాయి. అయితే కొత్త డెకో కొద్దిగా చిన్నదిగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌కి తాజా మీడియాటెక్ Dimensity 8450 ప్రాసెసర్ అందించనున్నారు. 6.59 అంగుళాల 1.5K LTPS ఫ్లాట్ స్క్రీన్, 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం 50MP ఆటోఫోకస్‌తో ఉండబోతుంది. అలాగే ఫోన్‌కు 6000mAh కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఇంకా IP66, IP68, IP69 రేటింగ్‌లతో ధూళి, నీటి నుండి రక్షణ అందించనుంది.

OPPO Pad SE:
OPPO Pad SE టాబ్లెట్ 11 అంగుళాల ‘సాఫ్ట్ లైట్ ఐ ప్రొటెక్షన్’ స్క్రీన్‌తో రానుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించబడిన ‘లెర్నింగ్ స్పేస్’ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 9340mAh భారీ బ్యాటరీ అందించనున్నారు. ఈ టాబ్లెట్ స్టార్‌లైట్ సిల్వర్, నైట్ బ్లూ కలర్స్‌లో లభించనుంది.

OPPO Enco Clip:
OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్ తక్కువ బరువుతో ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి అధిక స్పష్టత కలిగిన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9.5 గంటల వరకు ప్లేబ్యాక్ సపోర్ట్ ఇస్తాయి. ఇవి పెర్లెసెంట్ సీ, స్టార్ రాక్ గ్రే అనే కలర్ వేరియంట్లలో వస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ ఒరిజినల్ సౌండ్, హై డెఫినిషన్ ఎనలిసిస్, ప్యూర్ వొకల్స్, సర్జింగ్ బాస్ వంటి నాలుగు రకాల ట్యూనింగ్ మోడ్‌లను సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు వీటిలో రిమోట్ ఫోటోగ్రఫీ, AI కాల్ సమరీ కంట్రోల్, స్పేషియల్ సౌండ్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.