Leading News Portal in Telugu

Realme unveils concept phone with 10,000mAh battery, slim 8.5mm design, and 100W fast charging expected in 2026


Realme: గేమ్ ఛేంజర్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్ కొత్త కాన్సెప్ట్ ఫోన్ కు శ్రీకారం చుట్టిన రియల్‌మీ..!

Realme: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) తాజాగా ఒక అద్భుత కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. మొబైల్ లో 10,000mAh భారీ బ్యాటరీ కలిగి ఉండడం. ఇది సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో లభించే బ్యాటరీల కంటే రెట్టింపు సామర్థ్యం. రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీపీఎంపీ చేస్ శూ స్వయంగా దీనిని అన్‌బాక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫోన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. ఇక ఈ ఫోన్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఈ ఫోన్‌ 8.5mm మందం మాత్రమే ఉండగా, బరువు 212 గ్రాములు మాత్రమే ఉంది. ఇందులో సిలికాన్-అనోడ్ టెక్నాలజీ వాడినట్లు రియల్‌మీ తెలిపింది. దీని ద్వారా బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ 887Wh/L వరకు పెరిగి, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని తక్కువ స్థలంలో పొందినట్లు తెలిపారు.

ఏ ఫోన్‌లో Mini Diamond Architecture అనే ప్రత్యేక డిజైన్‌ను ఉపయోగించారు. ఇది 23.4mm వెడల్పుతో ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆండ్రాయిడ్ మైన్ బోర్డ్‌గా నిలిచింది. దీనికి సంబంధించి రియల్‌మీ ఇప్పటికే 60 గ్లోబల్ పేటెంట్లు పొందింది. దీని వల్ల భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిపించే అవకాశం దొరికింది. ఇక ఈ భారీ బ్యాటరీ ‘ట్రిపుల్ కోల్డ్ ప్రెస్’ టెక్నాలజీతో తయారు చేయబడింది. దీని వల్ల బ్యాటరీ ఉబ్బడం (swelling) ప్రమాదం తక్కువ. అలాగే క్యాథోడ్ భాగంలో CGT టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఎలెక్ట్రోలైట్ సమానంగా పంపిణీ అవుతుంది. ఫోన్ ప్రమాదవశాత్తూ పడిపోయినా దెబ్బ తినకుండా ఉండేందుకు డబుల్ గ్రూవ్ అల్యూమినియం ఫిల్మ్ రక్షణగా ఉంటుంది.

ఈ కాన్సెప్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండనుంది. ప్రాసెసర్‌గా మీడియాటెక్ Dimensity 7300 చిప్‌సెట్ వాడినట్లు కన్ఫర్మ్ అయింది. దీని ద్వారా మంచి పెర్ఫార్మెన్స్‌తో పాటు బ్యాటరీ ఎఫిషియెన్సీ కూడా ఆశించవచ్చు. ఈ ఫోన్ ఇప్పట్లో మార్కెట్‌లోకి రాదు. 2026లో మాత్రమే కమర్షియల్‌గా విడుదల అయ్యే అవకాశం ఉందని రియల్‌మీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఫోన్ డిజైన్, టెక్నాలజీ, బ్యాటరీ సామర్థ్యం భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమను కొత్త దిశగా తీసుకెళ్లే అవకాశముంది.