Leading News Portal in Telugu

vivo X200 FE with 6.31 inches Display and 6500mAh Battery Set to Launch in India in July 2025


Vivo X200 FE: భారత్‌లో విడుదలకు సిద్ధం అయిన కొత్త ఫ్లాగ్‌షిప్ వివో X200 FE ఫోన్.!

Vivo X200 FE: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (vivo) తన X200 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. లీకైన సమాచారం ప్రకారం vivo X200 FE పేరుతో ఈ ఫోన్‌ను 2025 జులైలో భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌కి 6.31 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే ఉండనుందని సమాచారం. ఇదివరకు రూమర్లలో వినిపించిన vivo X200 Pro Mini భారత్‌లో విడుదల కానుందని భావించగా అది జరగలేదు. కానీ, ఇప్పుడు అదే ఫోన్ డిజైన్‌ను కలిగి ఉండే X200 FE భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఇదివరకు అనుకున్న Dimensity 9400 స్థానంలో, Dimensity 9300+ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. లేదా Dimensity 9400e అనే కొత్త చిప్ వేరియంట్‌ను కూడా వాడే అవకాశం ఉంది.

వివో X200 FEలో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సోనీ 3X టెలిఫోటో కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉండనుందని సమాచారం. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది గొప్ప అప్షన్ కానుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉండనుంది. అంటే ఇది నీరు, ధూళి నుంచి మంచి రక్షణను అందించనుంది. X200 FEలో 6500mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది X200 Pro Miniలో ఉన్న 5700mAh కన్నా ఎక్కువ. ఈ బ్యాటిరికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌ 12GB + 256GB, 16GB + 512GB వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు రూ. 50,000 నుంచి 60,000 మధ్య ఉండొచ్చని అంచనా. అధికారికంగా ఈ మొబైల్ జులై 2025లో విడుదల కానుంది. చూడలి మరి టెక్ ప్రియులను ఈ ఫ్లాగ్‌షిప్ వివో X200 FE ఫోన్ ఎంతవేళకు ఆకట్టుకోగలదో.