Leading News Portal in Telugu

Samsung Galaxy F56 5G Launched in India with 120Hz AMOLED Display and 45W Fast Charging


Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!

Samsung Galaxy F56 5G: సామ్‌సంగ్ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F56 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గతంలో విడుదలైన గెలాక్సీ M56 కు అప్డేట్ గా వచ్చింది ఈ మోడల్. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది అత్యధికంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ Exynos 1480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి AMD Xclipse 530 GPU మద్దతుగా ఉంది. ఇది 8GB ర్యామ్ తో 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పై నడుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి. ముందుభాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తోంది. ఇది 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 సాంకేతికతను సపోర్ట్ చేస్తుంది. అయితే ఫోన్ బాక్స్‌లో చార్జర్ ఇవ్వలేదు. ఇక భద్రత పరంగా, ఇన్ -డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయంలో USB Type-C ఆడియో, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

గెలాక్సీ F56 5G ఫోన్ గ్రీన్, వయొలెట్ రంగులలో అందుబాటులో ఉంది. ఇక ధరల విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999గా నిర్ణయించబడింది. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లతో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో లభ్యమవుతుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా, వినియోగదారులు రెండువేల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా శాంసంగ్ ఫైనాన్స్+, ఇతర ప్రముఖ NBFC భాగస్వాముల ద్వారా ప్రతి నెల 1556 రూపాయలతో మొదలయ్యే EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.