
Sperm Quality: ప్రస్తుతం జీవన విధానాల్లో వచ్చిన మార్పులలో కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇలా మత్తు పదార్థాలకు అనేకమంది బానిసలైయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే, గంజాయి వినియోగం పురుషుల వీర్య నాణ్యతపై గణనీయమైన ప్రభావం చూపదని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఈ పరిశోధనలో కొంతమంది పురుషుల వీర్య నమూనాలను విశ్లేషించారు. వీర్య పరిమాణం, అలాగే వీర్య సంఖ్య, వీర్య సాంద్రత, వీర్యం కదలిక వంటి అంశాలను పరిశీలించారు. ఈ ఫలితాల్లో గంజాయి వినియోగదారులు, వినియోగించని వారి మధ్య ఎలాంటి గణనీయమైన తేడాలు లేవని తేలింది.
అయితే మరికొందరి పరిశోధనల ప్రకారం గంజాయి వినియోగం వీర్య ఆకృతి, వాటి పరిమాణాన్ని (volume) తగ్గించవచ్చని సూచించాయి. గంజాయి డోసు, నాటి వినియోగపు తరచుదనం, ఇంకా వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే.. సాధారణ గంజాయి వినియోగం వీర్య నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక, అధిక మోతాదులో వినియోగం విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఏదిఏమైనా ఇలాంటి మత్తు పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నించండి.