vivo Y300 GT Launched with 144Hz AMOLED Display, Dimensity 8400 Chipset, 7620mAh Battery, and 90W Fast Charging

Vivo Y300 GT: వివో తాజాగా చైనా మార్కెట్లో vivo Y300 GT స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత వారం విడుదలైన iQOO Z10 టర్బో మాదిరిగానే దీని స్పెసిఫికేషన్లు ఉండటంతో మంచి క్రేజ్ సంపాందించించుకుంటుంది. మరి ఈ అద్భుత ఫోన్ ఫీచర్లను ఒకసారి చూద్దామా..
డిస్ప్లే, ప్రాసెసర్:
vivo Y300 GT 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది 144Hz రిఫ్రెష్‌రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, డీసీ డిమ్మింగ్ సపోర్ట్‌తో ఉంది. ఇది SGS సర్టిఫికేషన్‌తో నీలి కాంతి (blue light) తగ్గింపు, తక్కువ ఫ్లికర్ సురక్షితతను కలిగి ఉంది. దీని పీక్ బ్రైట్నెస్ 5500 నిట్స్ వరకు ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 4nm ఆర్కిటెక్చర్‌పై తయారైన మీడియా టెక్ Dimensity 8400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో 8GB అండ్ 12GB ర్యామ్, అలాగే 256GB అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
కెమెరా సెటప్:
ఈ ఫోన్లో 50MP ప్రధాన కెమెరా (సోనీ LYT-600 సెన్సార్, f/1.79, OIS)తో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇది 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ డివైస్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి.
భారీ బ్యాటరీ:
వివో Y300 GTలో 7620mAh బ్యాటరీని అందించగా.. ఇందులో మూడవ తరం సిలికాన్ కార్బన్-సిలికాన్ టెక్నాలజీతో రూపొందించారు. దీనికి 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 28 నిమిషాల్లో 50% చార్జ్ పొందుతుంది.
ఇతర ముఖ్యమైన ఫీచర్లు:
ఈ ఫోన్లో IP65 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంది. ఇది మిలిటరీ గ్రేడ్ దృఢత కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 పై రన్ అయ్యే ఆరిజిన్ OS 5 పై పనిచేస్తుంది. డ్యూయల్ 5G, Wi-Fi 6, బ్లూటూత్
6.0, USB Type-C 2.0, NFC, ఇంకా పలు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఉంటుంది.
ధర, లభ్యత:
వివో Y300 జీత్ డెసర్ట్ గోల్డ్, బ్లాక్ లాంటి రెండు రంగులలో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఇప్పటికే ఇది విక్రయానికి అందుబాటులో ఉంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. 8GB+256GB వేరియంట్ 1899 యువాన్స్ (సుమారు రూ.22,565), 12GB+256GB వేరియంట్ 2099 యువాన్స్ (సుమారు రూ. 24,940), 12GB+512GB వేరియంట్ 2399 యువాన్స్ (సుమారు రూ. 28,510) గా ఉన్నాయి.