- గూగుల్ పిక్సెల్ 8 అసలు ధర రూ.75,999
- ఆఫర్ ధర రూ.44,999 (40% తగ్గింపు)
- రూ. 31,000 ఆదా.

Google Pixel 8: ఎవరైనా హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గోల్డెన్ అవకాశం వచ్చేసింది అనుకోవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గూగుల్ తయారు చేసిన అత్యుత్తమ ఫోన్లలో పిక్సెల్ 8 ఒకటి. ఇప్పుడు ఇది అసలు ధర కంటే చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. మరి ఆ ఫోన్ ఆఫర్స్, ఫీచర్స్ ఒకసారి చూద్దామా..
ఆఫర్ వివరాలు:
గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ అసలు ధర రూ. 75,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీన్ని కేవలం రూ. 44,999కి అందిస్తున్నారు. అంటే 40 శాతం డిస్కౌంట్ లో ఈ క్రేజీ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఏకంగా రూ. 31,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్‌కి 24 నెలల వరకు ఈఎంఐ (EMI) సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. నెలకు కేవలం రూ. 1583 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక కొన్ని ప్రత్యేక బ్యాంకుల క్రెడిట్ కార్డులపై అదనపు తగ్గింపు కూడా అందుతోంది. ఈ బ్యాంక్ కార్డులు మీ దగ్గర ఉంటే మీరు ఇంకా తక్కువ ధరకు ఫోన్‌ను పొందే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్స్:
ఈ ఫోన్ 6.2 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే, వేగవంతమైన పనితీరు అందించే గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్, అద్భుతమైన ఫొటోలు తీసుకునేందుకు 50MP మెయిన్ కెమెరా, 10.5MP ఫ్రంట్ కెమెరా అందించబడుతాయి. నీటి, ధూళి నిరోధకత కోసం IP68 రేటింగ్, 4575mAh బ్యాటరీ ఉన్నాయి.
నిజానికి ఇలాంటి డిస్కౌంట్ రావడం చాలా అరుదు. ఎప్పుడైనా ఒక గూగుల్ ఫోన్ కొనాలని అనుకున్నవారు, ఈ డీల్‌ను వెంటనే పొందవచ్చు. ఎందుకంటే, ఈ ఆఫర్ ఎప్పుడైనా విరమించబడే అవకాశం ఉంది. కాబట్టి హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ Google Pixel ఫోన్‌ను బడ్జెట్ ధరలో పొందే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.