Leading News Portal in Telugu

Top 5G Smartphones Under 15,000 Budget Phones on OnePlus, Samsung, and Realme details are


Budget Phones: రూ.15,000 లోపే అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇదిగో..!

Budget Phones: తక్కువ బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం. వివిధ బ్రాండ్ల నుంచి వచ్చిన పలు మోడల్స్‌పై ప్రస్తుతం ఆన్లైన్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరకే మంచి కెమెరా, పెద్ద బ్యాటరీ, మంచి పెర్ఫార్మెన్స్ గల ఫోన్లను EMI ఆప్షన్‌లో కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఆ ఆఫర్స్ ఏంటి? ఆ ఫోన్స్ ఏవో ఒకసారి చూద్దామా..

వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G:
ప్రీమియం లుక్ ఉన్న ఈ వన్‌ప్లస్ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 5G కనెక్టివిటీతోపాటు, 6.67 అంగుళాల డిస్ప్లే, 50MP రియర్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 16,437 గా ఉంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5% కాష్ బ్యాక్ పొందవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ M16 5G:
ఈ మొబైల్ ఇటీవలే విడుదలైన సామ్‌సంగ్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉండటంతో మంచి పెర్ఫార్మెన్స్ లభిస్తుంది. అలాగే, ఇది 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరాతో వస్తుంది. 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, 6GB/128GB ర్యామ్, 8GB/128GB ర్యామ్ వేరియంట్‌ లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 11,499కి లభ్యమవుతోంది.

రియల్‌మీ NARZO 80x 5G:
6.72-అంగుళాల పూర్తి HD+ LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 950 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఇది మీడియాటెక్ Dimensity 6400 5G చిప్‌సెట్‌తో నడుస్తుంది. 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది IP69 వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ రేటింగ్‌ను కలిగి ఉంది. MIL-STD 810H మిల్టరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ పరీక్షను కూడా పాస్ చేసింది. దీని ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 13,998కి లభ్యమవుతోంది. అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లతో తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ 5G ఫోన్లను ఎంచుకోవచ్చు. మరింత ఆలస్యం చేయకుండా ఈ డీల్స్‌ను వాడేస్కొండి.