
Airtel Black: భారతదేశంలో ఇంటర్నెట్, డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కు డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఎయిర్‌టెల్ తన బేసిక్ ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ (Airtel Black Plan)లో IPTV (Internet Protocol Television) సేవను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను కేవలం రూ.399కే అందుబాటులో ఉండడం విశేషం.
ఈ ప్లాన్‌లో మొత్తం మూడు రకాల సేవలు లభించనున్నాయి. మొదటగా ఇందులో వినియోగదారులకు 10 Mbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందించబడుతుంది. అయితే, ఇందులో FUP (Fair Usage Policy) అమలులో ఉంటుంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో 3333 GB డేటా వాడిన తరువాత స్పీడ్ 1 Mbpsకి తగ్గించబడుతుంది. ఇక రెండవది ల్యాండ్‌లైన్ కాలింగ్. ఇందులో ఎయిర్‌టెల్ ల్యాండ్‌లైన్ సౌకర్యంతో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాల్స్ చేయగలుగుతారు. ఇక మూడొవది IPTV సేవలు. ఈ కొత్త ప్లాన్‌లో 350 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ సహా IPTV సర్వీస్ కూడా అందించబడుతోంది. ఇది డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌ను మరింత చేరువ చేసాలా చేస్తోంది.
ఇక ఈ సేవలను పొందడానికి వినియోగదారులు ముందుగా రూ.2,500 చెల్లించాలి. ఇందులో అవసరమైన హార్డ్‌వేర్, ఇన్‌స్టాలేషన్ ఖర్చులు ఉండగా.. ఈ మొత్తం తర్వాత వచ్చే బిల్లుల్లో అడ్జస్ట్ చేయబడుతుంది. అయితే ఈ ప్లాన్‌లో ఒక మైనస్ ఉంది. ఇందులో ఎటువంటి ఓటీటీ యాప్స్, అధిక స్పీడ్ ఇంటర్నెట్ సేవలు లభించవు. అయినా ఇది ఒక ఎంట్రీ లెవల్ ప్లాన్ గా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఒకవేళ ఎక్కువ స్పీడ్ లేదా OTT సేవలు కావాలనుకుంటే.. ఎయిర్‌టెల్ 599 నుంచి 699 రూపాయల వరకు ఉన్న ప్రీమియం ప్లాన్లను కూడా అందిస్తోంది.