Leading News Portal in Telugu

Meizu Launches Note 16 and Note 16 Pro in China with Premium Features, Up to 144Hz Display, Snapdragon 7s Gen 3, and 6200mAh Battery


  • చైనాలో విడుదలైన మెయిజు (Meizu) Note 16, Note 16 Pro మొబైల్స్.
  • తక్కువ ధరకే భారీ ఫీచర్లు.
  • అతి త్వరలో భారత్ లో అమ్మకాలు.
Meizu Note 16 Series: తక్కువ ధరకే భారీ ఫీచర్లతో వచ్చేసిన మెయిజు నోట్ 16 సిరీస్..!

Meizu Note 16 Series: చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మెయిజు (Meizu) తన తాజా స్మార్ట్‌ఫోన్‌లు Note 16, Note 16 Pro మోడళ్లను అధికారికంగా చైనాలో విడుదల చేసింది. ఎన్నో టీజర్ల తరువాత వచ్చిన ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇందులో ముఖ్యంగా Note 16 Pro మోడల్ ప్రీమియం స్పెసిఫికేషన్లతో అలరించేలా ఉంది. మరి ఈ ఫోన్ల పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..

Meizu Note 16 Pro స్పెసిఫికేషన్స్:
Meizu Note 16 Pro స్మార్ట్‌ఫోన్ అధునాతన ఫీచర్లతో చైనా మార్కెట్లో ప్రవేశించింది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉండి, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీని స్క్రీన్ అనేది తక్కువ బార్డర్లతో అల్ట్రా-న్యారో డిజైన్‌లో ఉంటుంది. ప్రాసెసర్ పరంగా చూస్తే, ఇది 4nm టెక్నాలజీతో రూపొందించబడిన Snapdragon 7s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. గ్రాఫిక్స్‌కు Adreno 720 GPU సపోర్ట్ ఉంది. ఇది 8GB, 12GB, 16GB LPDDR4X RAM వేరియంట్లలో లభ్యమవుతూ, 256GB లేదా 512GB స్టోరేజ్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది Android 15 ఆధారిత కొత్త Flyme AIOS 2 ఓఎస్‌తో పనిచేస్తుంది. కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అప్రెచర్)తో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్ (f/2.2 అప్రెచర్) ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా (f/2.05 అప్రెచర్)ను పొందుపరిచారు. ఇక 6200mAh బ్యాటరీ సామర్థ్యం, 80W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ కోసం IP66, IP68 రేటింగ్‌లు ఉన్నాయి. ఫోన్ డిజైన్ విషయంలో ఇది 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా ప్రొటెక్షన్ కలిగిన స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. అలాగే ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, స్టీరియో స్పీకర్లు వంటి ప్రీమియం ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇక దీని ధర విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ 799 యువాన్స్ (దాదాపు రూ.9,470), 8GB + 256GB – 999 యువాన్స్ (దాదాపు రూ.11,840)గా ఉన్నాయి.

Meizu Note 16 స్పెసిఫికేషన్స్:
Meizu Note 16 స్మార్ట్‌ఫోన్ కూడా సరికొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో 6.78 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను వినియోగించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. స్క్రీన్‌ పరంగా ఇది 1050 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీనితో మంచి విజిబిలిటీని అందించగలదు. ఈ ఫోన్‌లో 6nm ఫాబ్రికేషన్ టెక్నాలజీతో రూపొందించిన UNISOC T8200 ప్రాసెసర్ ను ఉపయోగించారు. గ్రాఫిక్స్‌ కోసం Mali-G57 GPUని ఉపయోగించారు. ఇది 8GB RAMతో పనిచేస్తూ, 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక కెమెరా సెగ్మెంట్‌ పర్ణగా చూస్తే ఇందులో.. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో రియర్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్‌లో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. అలాగే 6600mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండగా, ఇది 40W ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ను కూడా అందించారు. ఇంకా ఈ ఫోన్ IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉండటంతో సాధారణ నీటి తడికి, ధూళికి ఫోన్‌ను రక్షించే విధంగా రూపొందించబడింది. ఇక దీని ధర విషయానికి వస్తే.. 8GB + 256GB వేరియంట్ 1499 యువాన్స్ (దాదాపు రూ.17,760), 12GB + 256GB వేరియంట్ 1699 యువాన్స్ (దాదాపు రూ.20,130), 12GB + 512GB వేరియంట్ 1899 యువాన్స్ (దాదాపు రూ.22,500), 16GB + 512GB వేరియంట్ 2099 యువాన్స్ (దాదాపు రూ.24,870) గా నిర్ణయించారు.