Samsung Galaxy S25 Edge launched in India: 200MP Camera, Snapdragon 8 Elite, and more premium features with flagship specs

Samsung Galaxy S25 Edge: శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ( Samsung Galaxy S25 Edge)ను మే 13న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్‌లో ఫోన్‌ను విడుదల చేయడంతో పాటు ధరలు, ప్రీ-ఆర్డర్ వివరాలు మరియు లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించింది. మరీ ఈ మొబైల్ సంబంధిత పూర్తి వివరాలను చూద్దామా..
డిస్‌ప్లే: 6.7-అంగుళాల QHD+ ఇన్ఫినిటీ-O డైనమిక్ AMOLED 2X, 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ సెరామిక్ 2
ప్రాసెసర్: 4.47GHz వరకు క్లాక్ స్పీడ్ ఉన్న క్వాల్కమ్ Snapdragon 8 Elite (3nm) చిప్‌సెట్, Adreno 830 GPU
ర్యామ్ అండ్ స్టోరేజ్: 12GB RAMతో 256GB / 512GB స్టోరేజ్.
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7
కెమెరాలు:
రియర్ కెమెరా: 200MP (f/1.7, OIS, 2x zoom), 12MP అల్ట్రావైడ్ (120° FOV, f/2.2), 4K @ 60fps, 8K @ 30fps, LED ఫ్లాష్.
ఫ్రంట్ కెమెరా: 12MP (f/2.2).
బ్యాటరీ: 3900mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, Qi వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్.
వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్: IP68
కనెక్టివిటీ: 5G SA/NSA, Wi-Fi 7, Bluetooth 5.4, USB Type-C, NFC
బరువు, పరిమాణం: 158.2 x 75.6 x 5.8 మిమీ, బరువు 163 గ్రాములు.
* గెలాక్సీ S25 ఎడ్జ్ ను భారత మార్కెట్లో టైటానియం సిల్వర్, టైటానియం జెట్‌బ్లాక్ రంగులలో అందుబాటులోకి తెచ్చారు.
ధరలు:
12GB + 256GB వేరియంట్ ధర: రూ. 1,09,999
12GB + 512GB వేరియంట్ ధర: రూ. 1,21,999
ప్రీ-ఆర్డర్ వివరాలు:
ఈ ఫోన్‌కు మే 13 మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్ మొదలు కానుంది.
ప్రీ-బుకింగ్ ఆఫర్లు:
12GB + 512GB వేరియంట్‌ను 256GB వేరియంట్ ధరకే పొందే అవకాశం కల్పించనున్నారు. (రూ. 12,000 విలువైన లాభం). అలాగే 9 నెలల వరకూ నో-కాస్ట్ EMI సదుపాయాన్ని కల్పించనున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ నూతన టెక్నాలజీ, అద్భుతమైన పనితీరు, అధునాతన కెమెరా ఫీచర్లతో ప్రీమియం కేటగిరీలో పోటీకి సిద్ధంగా ఉంది.