Portronics Launches Toad Ergo 3 Vertical Wireless Mouse with Ergonomic Design and Tri-Mode Connectivity
- వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని Toad Ergo 3 వర్టికల్ వైర్లెస్ మౌస్ విడుదల
- 3 మూడు విధాల వైర్లెస్ కనెక్టివిటీ
- USB-C ద్వారా ఛార్జింగ్ అయ్యే రీచార్జబుల్ బ్యాటరీ
- 148 గ్రాముల బరువు
- కేవలం రూ.1,149 మాత్రమే.

Portronics Toad Ergo 3: పోర్ట్రోనిక్స్ (Portronics) కంపెనీ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని Toad Ergo 3 అనే వర్టికల్ వైర్లెస్ మౌస్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ మౌస్ ను ప్రత్యేకంగా ఎక్కువసేపు డెస్క్‌లో పనిచేసేటప్పుడు వినియోగదారు సౌకర్యాన్ని ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించబడింది. ఆలాగే ఈ మౌస్ ఎర్గోనామిక్ డిజైన్ ద్వారా మణికట్టు ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా దీనిని డిజైన్ చేసారు. అలాగే ఇది వివిధ పనులకు అవసరమయ్యే పనితీరును అందిస్తుంది.
సాధారణ మౌస్ లాంటి సమాంతర రూపాన్ని వదిలి, టోడ్ ఎర్గో 3 నిలువు రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ డిజైన్ చేతిని మరింత సహజమైన, హ్యాండ్‌షేక్ లాంటి భంగిమలో ఉంచడానికి డిజైన్ చేయబడింది. ఇది మణికట్టు, ముంజేయిపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. ఇక ఈ Toad Ergo 3 మూడు విధాల వైర్లెస్ కనెక్టివిటీని అందిస్తుంది. 2.4GHz వైర్లెస్ రిసీవర్ ద్వారా లేదా Bluetooth 5.3 ద్వారా రెండు డివైస్‌లకు కనెక్ట్ కావచ్చు. ఈ మౌస్ ద్వారా ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పలు పరికరాల మధ్య సులభంగా స్విచ్ చేయవచ్చు.
ఈ మౌస్‌లో ఆరు బటన్‌లు ఉంటాయి. వీటిలో ముందుకు వెనక్కి నావిగేషన్ కోసం ప్రత్యేక బటన్‌లు ఉన్నాయి. DPI సెన్సిటివిటీ 2400 వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. అతి తేలికైన RGB లైటింగ్ కూడా ఇందులో ఉంది. ఇది చూడడానికి కూడా భలే గమ్మత్తుగా కూడా ఉంది. ఇది USB-C ద్వారా ఛార్జింగ్ అయ్యే రీచార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. మౌస్ వాడకంలో లేనప్పుడు “స్మార్ట్ స్లీప్” మోడ్ ద్వారా బ్యాటరీని కాపాడుతుంది కూడా. విండోస్, macOS రెండింటికి అనుకూలంగా ఇది పనిచేస్తుంది.
ఈ Toad Ergo 3 మౌస్ 148 గ్రాముల బరువు ఉంటుంది. Portronics Toad Ergo 3 ప్రారంభ ధర రూ. 1,149 గా ఉంది. ఇది Portronics అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ మౌస్ కు 12 నెలల వారంటీ కూడా లభిస్తుంది.