Xiaomi CIVI 5 Pro with Leica Optics, Snapdragon 8s Gen 4, and 50MP Triple Cameras Launching This May

Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్తోనూ, స్టైలిష్ డిజైన్‌తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. షియోమీ స్మార్ట్‌ఫోన్ సంస్థకు సంబంధించిన ప్రతినిధి వెయిబింగ్ మాట్లాడుతూ.. ఈ ఫోన్‌కు “లిటిల్ 15” అనే అంతర్గత కోడ్ నేమ్ ఉందని తెలిపారు. పెర్ఫార్మన్స్, కెమెరా సామర్థ్యం, స్క్రీన్, బ్యాటరీ వంటి అనేక అంశాల్లో ఈ ఫోన్ పెద్ద ఎత్తున మెరుగుదల పొందిందని.. అయినప్పటికీ CIVI సిరీస్‌కు ప్రత్యేకతైన సన్నని, లైట్ వెయిట్ రూపాన్ని ఇది కొనసాగిస్తుందని చెప్పారు.
కెమెరా సెటప్:
ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. టీజర్లో కనిపించిన “LEICA VARIO-SUMMILUX 1:6.3-2.2/15-60 ASPH” లెన్స్ డీటెయిల్స్ ప్రకారం f/1.63 అపర్చర్‌తో ప్రధాన కెమెరా ఉండగా, 15mm అల్ట్రా వైడ్ లెన్స్‌కు f/2.2 అపర్చర్ ఉంది. 60mm ఫోకల్ లెంథ్ ఆధారంగా ఇది 2.2x జూమ్‌తో టెలిఫోటో మాక్రో ఫంక్షన్‌ను అందించవచ్చని అంచనా. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉండనుంది.
ఇతర ఫీచర్లు:
ఈ ఫోన్ ఇటీవల Geekbench లో 25067PYE3C మోడల్ నెంబర్‌తో కనపడింది. ఇది కొత్త Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించనుందని వెల్లడైంది. 16GB RAM మోడల్ సమాచారం ఉన్నప్పటికీ, 12GB వేరియంట్ కూడా ఉండొచ్చని సమాచారం. CIVI 4 Proతో పోల్చితే, కొత్త CIVI 5 Pro లో 1.5K మైక్రో కర్వుడ్ స్క్రీన్, పెద్దగా మెరుగైన 6000mAh బ్యాటరీ (ముందు ఫోన్లో 4700mAh మాత్రమే) అందించనున్నారు. 3C సర్టిఫికేషన్ ప్రకారం ఈ ఫోన్ 67W ఫాస్ట్ చార్జింగ్‌కి మద్దతు ఇస్తుంది. మొత్తంగా ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, విడుదల తేదీ తదితర వివరాలు షియోమీ అధికారికంగా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.