Leading News Portal in Telugu

Amazfit Bip 6 Launched in India with 1.97 inches AMOLED Display, Bluetooth Calling, GPS, and 14-Day Battery Life at Rs 7999


Amazfit Bip 6: 1.97 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో అమెజ్‌ఫిట్ బిప్ 6 విడుదల..!

Amazfit Bip 6: ప్రముఖ వేర్‌బుల్ బ్రాండ్ అయిన అమెజ్‌ఫిట్ తాజాగా బిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్ Amazfit Bip 6 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ వాచ్‌కి భారీ 1.97 అంగుళాల AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. ఇది ముందు ఉన్న LCD స్క్రీన్‌ని భర్తీ చేస్తూ 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ వరకు అందిస్తుంది. దీనితో పాటు, ఆటోమేటిక్ బ్రైట్‌నెస్‌కు అంబియెంట్ లైట్ సెన్సార్‌ కూడా కల్పించారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్‌తో బలమైన డిజైన్‌ను అందించారు. దీనిలో ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్, స్పీకర్‌తో బ్లూటూత్ కాలింగ్‌కి మద్దతు ఉంటుంది. ముందుగా ఉన్న IP68 వాటర్ రెసిస్టెన్స్‌కు బదులుగా ఇప్పుడు ఇది 5ATM (50 మీటర్ల వరకు) వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది.

ఇందులో బిల్ట్-ఇన్ GPSతో పాటు ఐదు శాటిలైట్ సిస్టమ్స్‌కు మద్దతు ఉంటుంది. ఈ వాచ్ 140కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను కలిగి ఉంది. ఇందులో HYROX రేస్, స్మార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంకా పర్సనలైజ్డ్ AI కోచింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. సాధారణ వాడకంలో ఇది 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అమెజ్‌ఫిట్ బిప్ 6 బ్లాక్, చార్కోల్, స్టోన్, రెడ్ రంగులలో లభ్యం కానుంది. దీని ధర రూ. 7,999గా నిర్ణయించబడింది. ఇది ఈ రోజు (మే 16) మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, Amazfit India వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Amazfit Bip 6 స్పెసిఫికేషన్స్:

* 1.97 అంగుళాల (390 x 450 పిక్సెల్స్) AMOLED స్క్రీన్, టెంపర్డ్ గ్లాస్, యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో

* Bluetooth 5.2 – Android 7.0 పైకి, iOS 14.0 పైకి

* బ్లూటూత్ కాలింగ్ కోసం మైక్రోఫోన్, స్పీకర్

* బ్లడ్-ఆక్సిజన్, హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటరింగ్ కోసం BioTracker PPG సెన్సార్

* GPS – ఐదు శాటిలైట్ సిస్టమ్స్

* 140+ స్పోర్ట్స్ మోడ్స్, AI కోచింగ్

* కాల్ నోటిఫికేషన్స్, మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్

* 5ATM వాటర్ రెసిస్టెన్స్

* 340mAh బ్యాటరీ: 14 రోజుల బ్యాటరీ లైఫ్, హెవీ యూజ్‌లో 6 రోజులు, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 26 రోజులు.