Leading News Portal in Telugu

Experts Warn: Rising Temperatures Can Overheat Smartphones – Key Summer Safety Tips


  • ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా వేడిని తట్టుకోలేవు
  • ఎక్కువ వాడకం వల్ల సెల్‌ఫోన్లు వేడెక్కే అవకాశం
  • రాష్ట్రంలో ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • సెల్ ఫోన్లకు మరింత చేటు చేస్తాయన్న నిపుణులు
Smartphone Safety Tips : వేసవిలో మీ ఫోన్ బాగా వేడెక్కుతుందా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా వేడిని తట్టుకోలేవు. ఎక్కువ వాడకం వల్ల సెల్‌ఫోన్లు వేడెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సెల్ ఫోన్లకు మరింత చేటు చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో వీడియో కాల్ మాట్లాడొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడొద్దని సూచిస్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో.. బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్, జీపీఎస్ వంటి సర్వీసులను ఆఫ్ చేయాలని చెబుతున్నారు. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Balochistan: ‘‘దమ్ముంటే క్వెట్టా దాటి బయటకు రండి’’.. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..

మీ ఫోన్​ను సూర్యకాంతిలో ఎక్కువగా వాడొద్దు. ఒకవేళ ఎండలో ఉంచితే మీ స్మార్ట్ ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ప్రస్తుత కాలంలో చాలా స్మార్ట్ ఫోన్లు గంటలోపే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్లు కేవలం రెండు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దాని వల్ల ఫోన్ వేడెక్కిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ కవర్​ను తీసేయండి. వేసవికాలంలో ఆరుబయట లేదా వేడి గదుల్లో ఎక్కువసేపు వీడియో గేమ్​లను ఆడితే స్మార్ట్‌ ఫోన్‌ వేడెక్కే ప్రమాదం ఉంది. మీరు కనుక ఏసీ రూమ్​లో వీడియో గేమ్స్ ఆడుకోవడం వల్ల మీ ఫోన్ వేడెక్కదు.

READ MORE: Naga Chaitanya: చైతూ లుక్ అదిరింది బాసూ

చాలా మంది ఫోన్​ను కారు డాష్ బోర్డులో ఉంచుతారు. కారును నావిగేట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్​ను వాడుతారు. అయితే వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి నావిగేషన్ యాప్స్ వాడడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. ఈ వేడిని తగ్గించడానికి డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఫోన్‌ ను ఏసీ వెంట్ పక్కన ఉంచండి. మీరు బైక్​లో వెళ్తుంటే బ్యాగ్ లేదా జేబులో ఫోన్​ను ఉంచుకోండి. మీ ఫోన్​ను అదే పనిగా మరీ ఎక్కువగా వాడకుండా, కాస్త పక్కనపెట్టండి. అలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. మీ ఫోన్‌తె వచ్చిన ఒర్జినల్ ఛార్జగ్‌తోనే ఛార్జింగ్ పెట్టండి. వేరే ఛార్జగ్‌తో మీ ఫోన్​కు ఛార్జింగ్ పెట్టడం వల్ల అది వేడెక్కే ప్రమాదం ఉంది.

READ MORE: MLC Botsa Satyanarayana: ఆర్థికంగా ఏపీ.. పాకిస్తాన్‌ అయిపోతుంది.. బొత్స సంచలన వ్యాఖ్యలు

మీరు ఉపయోగించని యాప్స్‌ను అన్​ఇన్​స్టాల్ చేయడం మంచిది. నిరంతరం యాప్స్ ఆప్డేట్​లు కోసం నోటిఫికేషన్లు పంపుతాయి. దీంతో ఫోన్ వేడెక్కిపోయే ప్రమాదం ఉంది. అందుకే నోటిఫికేషన్​లను కూడా ఆఫ్ చేయండి. ఇలా చేయడం యాప్​లు బ్యాక్ గ్రాండ్​లో రన్ అవ్వవు. దీంతో ఫోన్ వేడెక్కే ప్రమాదం తగ్గుతుంది. మీ ఫోన్​ను మూసేసిన కారులో ఉంచొద్దు. అలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. కారు మూసేసిన తర్వాత దాని లోపలి భాగం వేడెక్కిపోతుంది.