- జుట్టు ఆడవారితో పాటు మగవారికి కూడా ముఖ్యమే
- జుట్టు ఆడ, మగవారి అందంలో ప్రధాన పాత్ర
- బట్టతల సమస్యతో బాధపడుతున్న యువత
- వంశపారపర్యంగా బట్టతల వస్తుందా?

జుట్టు అనేది ఆడవారితో పాటు మగవారికి కూడా ముఖ్యమే. జుట్టు ఆడ, మగవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు పొడుగ్గా ఉండటం అమ్మాయిలకు ఎంత ఇష్టమో.. తలపై ఒత్తుగా, నిండైన హెయిర్ ఉండటం కూడా అబ్బాయిలకు అంతే ఇష్టం. అయితే, ఈ రోజుల్లో చాలా మంది యువత బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య మానసికంగా వారిని చిదిమేస్తుంది. కాగా.. బట్టతల రావడంపై అనేక అపోహలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ప్రధానమైన ప్రశ్న వంశపారపర్యంగా బట్టతల వస్తుందా? అనేది. ఇప్పుడు మనం దీనికి సమాధానం తెలుసుకుందాం..
READ MORE: PAK Beggars: బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్.. 5 వేల మందిని వెనక్కి పంపిన సౌదీ..
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. జుట్టు రాలడం అనేది తల్లిదండ్రుల ఇరువైపుల నుంచీ వారసత్వంగా వస్తుంది. పేరెంట్స్‌లో ఎవరివైపునైనా జుట్టు రాలి బట్టతల వచ్చిన వారు ఉంటే.. అది తమ వారసులకు కూడా వారసత్వంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మగాళ్లలోనే కాదు.. కొంతమంది మహిళల్లో కూడా లైట్‌గా కనిపిస్తుంది.
READ MORE: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్..
బ్రిటన్‌లో 2017లో ప్రచురితమైన పీఎల్ఓఎస్ జెనెటిక్స్ జర్నల్‌లో… 52 వేల మంది పురుషులపై వంశపారపర్యంగా వచ్చే బట్టతల విషయంలో పరిశోధన చేసినట్టు ఒక బ్రిటిష్ పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ అధ్యయనంలో కనీసం 287 మందికి జుట్టు ఊడిపోవడంలో జన్యుపరమైన సమస్యలు ఉన్నట్టు కూడా తేల్చింది. 40 శాతం బట్టతలకు కారణం ఎక్స్ క్రోమోసోమోలో లోపాలు ఉండి ఉంటాయని ఈ పరిశోధకుల బృందం తెలిపింది. అంటే ఒక జన్యువు తల్లి నుంచి వారసత్వంగా వస్తుండగా.. మిగిలినవి జన్యువులలో ఇద్దరివీ ఉండొచ్చు. తల్లి నుంచి ఆమె కుటుంబం నుంచి బలమైన జన్యువులు పిల్లలకు రావడం నిజమైనప్పటికీ, కేవలం ఒక్క జన్యువు వల్లనే బట్టతలకు కారణం కాదని నిపుణులు చెప్పారు. అయితే పురుషుల్లో, మహిళల్లో బట్టతల ఒకే విధంగా ఉండదు. మహిళలకు సాధారణంగా బట్టతల ఎక్కువగా కనిపించదు. అయితే వారు కూడా తలపై భాగం నుంచి కొంత జుట్టు కోల్పోతూ ఉంటారు.