- జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం
- వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేసుకోవాలి
- బయట దొరికే జూస్‌లలో ఐస్ వాడొద్దు
- పూణేకు చెందిన డాక్టర్ రెబెక్కా పింటో స్పష్టం

జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్‌లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్‌లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను తెచ్చిపెడతాయి. ఐస్ ఎందుకు హానికరం? ఐస్ తో కూడిన కూల్ డ్రింగ్స్ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? దీనికి సంబంధించి.. పూణేకు చెందిన డాక్టర్ రెబెక్కా పింటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.
READ MORE: Rajasthan High Court: సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో కీలక అప్‌డేట్
రెబెక్కా పింటో తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ మోతాదులో తయారు చేసే ఐస్ ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే అందులో హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారకాలు, కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఐస్ తయారు చేసే ప్రదేశంలో పరిశుభ్రత అస్సలు ఉండదు. నేల మీదే దాన్ని పరేస్తుంటారు. ఐస్ తయారీకి ట్యాబ్ వాటర్ వాడుతుంటారు. ఆ నీళ్లను అస్సలు ఫిల్టర్ చేయరు. అందులో చాలా బ్యాక్టీరియా కలిసిపోతుంది. శుద్ధి చేయని నీటితో తయారు చేయబడిన ముడి మంచులో E. coli, norovirus వంటి బ్యాక్టీరియా, వైరస్‌లు ఉండవచ్చు. ఇవి జీర్ణశయాంతర వ్యాధులకు కారణమవుతాయి. అందుకే బయట జూస్‌లు తాగేటప్పుడు ఐస్ వేసుకోకపోవడమే మంచిది.
READ MORE: Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా.. సీన్ లోకి హీరో అత్త..