Leading News Portal in Telugu

Telegram Announces Global Contest for Content Creators with Over Rs 42 Lakh Prize Pool


Telegram Global Contest: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్ ప్రకటించిన టెలిగ్రామ్.. 42 లక్షలకు పైగా బహుమతులు..!

Telegram Global Contest: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తూ టెలిగ్రామ్ తమ మొదటి అంతర్జాతీయ పోటీని ప్రకటించింది. ఈ కాంటెస్ట్‌లో విజేతలకు మొత్తం 50,000 డాలర్స్ (భారత రూపాయల్లో సుమారుగా రూ. 42.8 లక్షలు) బహుమతులు అందించనున్నారు. ఈ పోటీ ద్వారా టెలిగ్రామ్ తన మెసేజింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొనేవారు టెలిగ్రామ్ అందించిన సాంకేతిక, వినూత్న ఫీచర్లను చాటి చెప్పే షార్ట్ వీడియోలు రూపొందించాలి.

టెలిగ్రామ్ సీఈఓ, సహ-సంస్థాపకుడు పావెల్ డ్యూరోవ్, తన అధికారిక చానెల్‌లో పోటీ ప్రకటన చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ టెలిగ్రామ్‌పై “తప్పుడుప్రచారం” నిర్వహించిందని ఆరోపించిన డ్యూరోవ్, “ఇకపై మంచి పద్దతిలో ఆడటం లేదు, గ్లవ్స్ తీయండి” అంటూ కాస్త గట్టిగానే ప్రతిస్పందించారు. అలాగే, వాట్సాప్ తరచుగా టెలిగ్రామ్ పరిచయం చేసిన ఫీచర్లను “తక్కువ నాణ్యతతో” అనుకరిస్తోందని విమర్శించారు.

ఇకపోతే, టెలిగ్రామ్ మెసేజింగ్ టెక్నాలజీని మలుపు తిప్పిన ఫీచర్లను ఈ పోటీ ప్రధానంగా హైలైట్ చేయాలనుకుంటోంది. వీటిలో ఫైల్ షేరింగ్, చానెల్ బ్రాడ్‌కాస్టింగ్, కస్టమైజబుల్ ఇంటర్‌ఫేస్‌లు, బాట్ ఇంటిగ్రేషన్ లను టెలిగ్రామ్ ముందుగా ప్రవేశపెట్టినవని కంపెనీ తెలిపింది. వాట్సాప్ వంటి ఇతర యాప్‌లు తరువాత వాటిని స్వీకరించాయని ఆరోపించారు.

ఇక పోటీ గురించిన వివరాలు చూస్తే.. ఇందులో బహుమతి మొత్తంగా 50,000 డాలర్స్ వరకు ఇవ్వనుండగా.. మే 26, 2025 (గల్ఫ్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 11:59 వరకు) గడువును ఇచ్చారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చు. జూన్ 2025లో ఫలితాలను ప్రకటిస్తారు. ఇక ఇందులో ఒక్కో వీడియో గరిష్ట వ్యవధిని 180 సెకన్లుగా ఉంచారు. ఈ వీడియోను ఇంగ్లీష్ లో రూపొందించాలి. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కి అనుకూలంగా ఉండాలి. వీటిలో AI టూల్స్ సహాయంగా కూడా వాడుకోవచ్చు

స్పష్టత, విజువల్ ఆకర్షణ, మీమ్‌ అర్హత, వైరల్ కావడానికీ అనువుగా ఉండడం లాంటి అంశాల ఆధారంగా జడ్జ్ చేయబడతాయి. ఈ పోటీలో వ్యక్తిగతంగా గానీ, బృందాలుగా గానీ పాల్గొనవచ్చు. విజేతలకు నగదు బహుమతులతో పాటు, టెలిగ్రామ్ గ్లోబల్ యూజర్ బేస్‌లో గుర్తింపు లభించనుంది.