Leading News Portal in Telugu

Best Vivo Smartphones Under Rs 15000 with a Style Meets Performance on a Budget


Vivo Smartphones: కేవలం రూ.15,000లోపే బెస్ట్ స్టైల్, పనితీరు ఫీచర్లతో అందుబాటులో ఉన్న వివో ఫోన్లు ఇవే..!

Vivo Smartphones: స్టైలిష్ లుక్, మృదువైన ఫీల్‌తో పాటుగా నిత్యవసరాలన్నింటినీ నిర్వహించే ఫీచర్లతో టెక్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది వివో అని చెప్పవచ్చు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఫోన్లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటోంది వివో. ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే అందిస్తూ టెక్ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అందిస్తోంది వివో. మరి రూ.15,000 కంటే తక్కువ బడ్జెట్ లో లభించే కొన్ని బెస్ట్ వివో ఫోన్ల వివరాలు ఉన్నాయి.

Vivo Y16:
తక్కువ వాడకానికి అనుగుణంగా Vivo Y16 అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.51 అంగుళాల HD+ స్క్రీన్, 5000mAh బ్యాటరీ, Helio P35 చిప్‌తో వస్తుంది. కాల్స్, మెసేజ్‌లు, సాధారణ వాడకం కోసం ఇది సింపుల్ ఇంకా స్టైలిష్ ఎంపికగా చెప్పుకోవచ్చు. దీని ధర రూ.9,999.

Vivo Y17s:
అద్భుతమైన కెమెరా పనితీరు, మంచి బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నవారికి ఇది పర్ఫెక్ట్ ఎంపిక. 50MP ప్రధాన కెమెరా, 6.56 అంగుళాల బ్రైట్ నెస్ డిస్ప్లే, MediaTek Helio G85 ప్రాసెసర్ దీని ముఖ్య ఫీచర్లు. 5000mAh బ్యాటరీ రోజుకి ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సరిపోతుంది. వీడియోలు చూడటం, సోషల్ మీడియా వాడకానికి ఇది చక్కటి ఎంపిక. దీని ధర కేవలం రూ.10,499.

Vivo T2x 5G:
ఈ ఫోన్ వేగంగా పని చేయడం, ఎక్కువ బ్యాటరీ లైఫ్, 5G సపోర్ట్ వంటి ఫ్యూచర్ ప్రూఫ్ ఫీచర్లతో వస్తుంది. Dimensity 6020 ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్ 6.58 అంగుళాల FHD+ డిస్ప్లే కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. అల్ట్రా స్లిమ్ డిజైన్ దీని ప్రత్యేకత. ఈ ధరలో బెస్ట్ పవర్ కావాలంటే ఇది మిస్ అవ్వకండి. దీని ధర రూ.12,999.

వివో ఫోన్లు ధరకు అందుబాటులో ఉండే స్టైలిష్, ఫ్రెండ్‌లీ టచ్‌తో ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటాయి. బడ్జెట్ ఫోన్‌లు అయినా కెమెరా పనితీరు, లుక్, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌తో అదిరిపోయే విలువను అందిస్తాయి. విద్యార్థులు, ఎక్కువ కాల్స్ చేసే యూజర్లు, తక్కువ ధరలో మెరుగైన ఫోన్ కోరేవారికి ఇవి బెస్ట్ ఎంపిక.