Leading News Portal in Telugu

Realme GT 7 Sets Guinness World Record with 24-Hour Non-Stop Movie Playback


Realme GT 7: లాంచ్ కాకముందే.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన రియల్‌మీ GT 7.. ఎలాగంటే?!

Realme GT 7: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (realme) తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ GT 7 కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఒక వినూత్న కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ రికార్డు “మొబైల్ ఫోన్‌పై అత్యంత సమయం సినిమాలు వీక్షించిన మారథాన్”గా నమోదు అయింది. మే 23న గిన్నీస్ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ రికార్డు నమోదైంది. GT 7 స్మార్ట్‌ఫోన్‌తో మొత్తం 24 గంటల పాటు నాన్-స్టాప్ మూవీ ప్లేబ్యాక్ చేయడంతో ఈ అద్భుతం సాధ్యమైంది. ఈ ప్రయత్నం భాగంగా రియల్‌మీ సంస్థ “Endless Power Journey” పేరిట యూరప్‌లో ప్రత్యేకంగా ఓ క్రూయిజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇది ఇటలీ రోమ్ నుండి ప్రారంభమైంది. ఇదే సమయంలో చైనా షెన్‌జెన్ నుండి లైవ్‌స్ట్రీమ్ ద్వారా ప్రారంభించి, 24 గంటలు పూర్తి చేసి గిన్నీస్ రికార్డు అందుకుంది.

ఈ ఘనత సాధించడానికి ప్రధాన కారణం realme GT 7 లో ఉన్న 7200mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ సాంకేతికత. దీనికి తోడు ఈ బ్యాటరీ వ్యవస్థకు TUV Rheinland సంస్థ 5-స్టార్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇలా సాధ్యమైన బ్యాటరీ లైఫ్ వల్లే నాన్-స్టాప్ మూవీ వీక్షణ సాధ్యమైంది. రియల్‌మీ GT 7, GT 7T సిరీస్ ఫోన్లు మే 27న పారిస్ లో గ్లోబల్‌గా విడుదల కానున్నాయి. భారత మార్కెట్‌లో కూడా అదే రోజు ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. విడుదల అనంతరం ఈ ఫోన్లు రియల్‌మీ, అమెజాన్ ఇంకా ఇతర రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

Image (4)

రియల్‌మీ GT 7 ఫోన్ ఫీచర్లలో ముఖ్యమైన అంశాలు:
డిస్‌ప్లే: 6.8-ఇంచ్ AMOLED, 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

ప్రాసెసర్: MediaTek Dimensity 9400+ (3nm)

ర్యామ్ & స్టోరేజ్: 12GB/16GB RAM, 256GB – 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ (UFS 4.0)

కెమెరా: 50MP (ప్రధాన కెమెరా), 8MP (అల్ట్రావైడ్), 16MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ: 7200mAh Si/C Li-Ion, 100W ఫాస్ట్ ఛార్జింగ్

ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 పై Realme UI 6.0

వాటర్ రెసిస్టెన్స్: IP68/IP69 సర్టిఫైడ్

ఆడియో: స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో

ఈ రికార్డు ఫోన్‌తో టెక్నాలజీకి కొత్త ఎత్తుగడలు నిర్ణయించిన రియల్‌మీ, ఇప్పుడు ప్రీమియం మార్కెట్‌లోకి గట్టి పోటీగా అడుగుపెట్టబోతున్నదనే చెప్పవచ్చు. GT 7 లాంచ్ తర్వాత టెక్ ప్రియుల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.