Leading News Portal in Telugu

Motorola Razr 60 Launched in India at Rs 49999 with Dual Displays, 50MP Camera, and Foldable Design


Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

Motorola Razr 60: కొత్త ఫ్లిప్ ఫోన్ మోటరోలా రేజ్‌ర్ 60 ను భారత్‌లో మోటరోలా అధికారికంగా లాంచ్ చేసింది. గతంలో ప్రకటించినట్లుగానే జూన్ 4వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయానికి సిద్ధంగా ఉండనుంది. మోటరోలా రేజ్‌ర్ 60 శక్తివంతమైన ఫీచర్లు, కొత్త డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందుకుంది. మరీ ఈ కొత్త మడతపెట్టే ఫోన్ సంబంధించిన పూర్తికి వివరాలను చూద్దాము.

డిస్‌ప్లే:
ఈ ఫోన్‌లో 6.96-అంగుళాల FHD+ LTPO pOLED FlexView ఇంటర్నల్ డిస్‌ప్లే ఉంది. దీనిని 1Hz నుండి 120Hz వరకు మనకు సరిపోయే విధంగా డైనమిక్ రిఫ్రెష్‌రేట్‌ ను సపోర్ట్ ఇవ్వగలదు. అలాగే ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ తో వస్తోంది. ఫోల్డ్ చేసినప్పుడు బయట కనిపించే 3.63-అంగుళాల QuickView pOLED LTPS డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్‌రేట్, 1700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. దీనికి Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ ఉంది.

ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400X 4nm ప్రాసెసర్, Mali-G615 GPU, 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ ఇవ్వబడింది. ఇది ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ కు 3 OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రాధమిక కెమెరా (OIS తో), 13MP అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో మోడ్ తో) ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది. మోటరోలా ప్రకారం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 100% ట్రూ కలర్ వీడియో జెచ్చర్ కెమెరా తో వచ్చిన ఫోన్‌గా గుర్తింపు పొందింది.

Moto

బ్యాటరీ, ఇతర ఫీచర్లు:
మోటరోలా రేజ్‌ర్ 60 ఫోన్ 4500mAh బ్యాటరీ తో వస్తుంది. ఇది 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP48 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, టైటానియం రిఇన్‌ఫోర్స్‌డ్ హింజ్ (500,000 ఫోల్డ్స్ టెస్ట్) వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే Dolby Atmos స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో అందుబాటులో ఉన్నాయి. మోటరోలా రేజ్‌ర్ 60 ఫోన్ పాన్ టోన్ జిబ్రాల్టర్ సి, స్ప్రింగ్ బడ్, లైటెస్ట్ స్కై రంగుల్లో లభ్యం కానుంది.

ధర:
మోటరోలా రేజ్‌ర్ 60 ఫోన్ ధర రూ. 49,999గా నిర్ణయించబడింది. జూన్ 4వ తేదీ నుంచి మోటోరోలా, ఫ్లిప్ కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త మోడల్‌ ద్వారా మోటరోలా ఫ్లిప్ ఫోన్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.